Maruti Suzuki Swift Mocca cafe Edition : కాఫీ కలర్లో స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్.. లుక్ అదిరింది!
27 March 2023, 7:42 IST
Maruti Suzuki Swift Mocca cafe Edition : స్విఫ్ట్ మోకా కేఫ్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది మారుతీ సుజుకీ. 2023 బ్యాంకాక్ మోటార్ షోలో దీనిని ప్రదర్శనకు ఉంచింది. ఈ మోడల్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
కాఫీ కలర్లో మారుతీ సుజుకీ స్విఫ్ట్.. కొత్త ఎడిషన్ ఇదే!
Maruti Suzuki Swift Mocca Edition : 2023 బ్యాంకాక్ మోటార్ షోలో.. స్విఫ్ట్‌కు చెందిన ఓ స్పెషల్ ఎడిషన్‌ను ప్రదర్శించింది మారుతీ సుజుకీ. అదే.. 2023 మారుతీ సుజుకీ మోకా కేఫ్ ఎడిషన్. ఇది కాఫీ రంగులో ఉంది. సాధారణ స్విఫ్ట్‌తో పోల్చుకుంటే ఇందులో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వెహికిల్ ప్రత్యేకతలను తెలుసుకుందాము..
ఇండియాలో అధిక డిమాండ్ ఉన్న మోడల్స్‌లో స్వీఫ్ట్ ఒకటి. 2021లోనే ఇది 25వేల లక్షల సేల్స్ మైలురాయిని దాటేసింది. కాగా.. ఇటీవలి కాలంలో స్విఫ్ట్‌కు ఇతర సంస్థల మోడల్స్ నుంచి పోటీ ఎక్కువ అవుతోంది. పోటీకి చెక్ పెట్టేందుకు ఓ స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది మారుతీ సుజుకీ.
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మోకా కేఫ్ ఎడిషన్- ఫీచర్స్..
Swift Mocca Edition price : ఈ మారుతీ సుజుకీ స్పెషల్ ఎడిషన్ స్వీఫ్ట్లో డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ (పాస్టెల్ బ్రౌన్, లేత గోధుమ రంగు) ఉంటుంది. ఇందులోని ఫ్రెంట్, రేర్ బంపర్లు మరింత స్పోర్టీగా కనిపిస్తున్నాయి. చుట్టూ బ్లాక్ క్లాడింగ్ డిజైన్ లభించింది. స్వెప్ట్ బ్యాక్ హాలోజెన్ హెడ్‌లైట్స్, క్రోమ్ స్టడ్డెడ్ గ్రిల్, వైడ్ ఎయిర్ డ్యామ్, సీ పిల్లర్ మౌంటెడ్ డోర్ హ్యాండిల్స్, 17 ఇంచ్ డిజైనర్ బ్రాంజ్ కలర్డ్ వీల్స్ వస్తున్నాయి. రేర్‌లో షార్క్ ఫిన్ యాంటీనా, డ్యూయెల్ ఎగ్జాస్ట్ టిప్ గ్రేస్‌లు లభిస్తున్నాయి.
2023 స్విఫ్ట్ మోకా కేఫ్ ఎడిషన్‌లో మేజర్ అప్డేట్ అంటే.. క్యాబిన్! ఇందులో కాఫీ రంగులోని లెథర్ అప్‌హోలిస్ట్రీ.. సీట్స్, డోర్ ట్రిమ్స్కు వస్తోంది. డాష్‌బోర్డ్‌కు లేత గోధుమ రంగు లభిస్తోంది.
Swift Mocca Edition India launch : ఆల్ న్యూ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, లెథర్ వ్రాప్డ్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ కీఎల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీ, ఏబీఎస్ వంటి ఫీచర్స్ ఈ మారుతీ సుజుకీ స్విఫ్ట్ మోకా కేఫ్ ఎడిషన్‌కు లభిస్తున్నాయి.
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మోకా కేఫ్ ఎడిషన్- ఇంజిన్..
2023 స్విఫ్ట్ మోకా కేఫ్ స్పెషల్ ఎడిషన్‌లో 1.2 లీటర్ డ్యూయెల్జెట్, డ్యూయెల్ వీవీటీ ఇన్లైన్ 4 కే సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఇది 89హెచ్‌పీ పవర్‌ను, 113ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ20 ఫ్యూయెల్పైనా ఇది నడుస్తుంది.
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మోకా కేఫ్ ఎడిషన్- ధర..
Maruti Suzuki Swift special Edition : థాయ్‌లాండ్‌లో స్విఫ్ట్ మోకా కేఫ్ ధర 6,37,000 టీహెచ్బీ. అంటే దాదాపు రూ. 15.38లక్షలు. ఇండియాలో ఈ మోడల్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ వెల్లడించలేదు. ధరతో పాటు లాంచ్‌కు సంబంధించిన వివరాలపై రానున్న కాలంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.