Hyundai Grand i10 Nios vs Maruti Swift : న్యూ గ్రాండ్​ ఐ10 నియోస్​ వర్సెస్​ మారుతీ స్విఫ్ట్​.. బెస్ట్​ ఏది?-new hyundai grand i10 nios vs maruti suzuku swift check detailed comparison here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  New Hyundai Grand I10 Nios Vs Maruti Suzuku Swift, Check Detailed Comparison Here

Hyundai Grand i10 Nios vs Maruti Swift : న్యూ గ్రాండ్​ ఐ10 నియోస్​ వర్సెస్​ మారుతీ స్విఫ్ట్​.. బెస్ట్​ ఏది?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 22, 2023 08:24 AM IST

New Hyundai Grand i10 Nios vs Maruti suzuku Swift : హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ఇటీవలే లాంచ్​ అయ్యింది. ఇది మారుతీ సుజుకీ స్విఫ్ట్​కు గట్టిపోటీనిస్తుంది. ఈ నేపథ్యంలో.. ఈ రెండింట్లో ది బెస్ట్​ ఏదనేది ఇక్కడ తెలుసుకుందాము..

గ్రాండ్​ ఐ10 నియోస్​ వర్సెస్​ మారుతీ స్విఫ్ట్​.. ది బెస్ట్​ ఏది?
గ్రాండ్​ ఐ10 నియోస్​ వర్సెస్​ మారుతీ స్విఫ్ట్​.. ది బెస్ట్​ ఏది?

New Hyundai Grand i10 Nios vs Maruti suzuku Swift : ఇండియా ఆటో మార్కెట్​లో ప్రస్తుతం ఎస్​యూవీల హవా నడుస్తోందన్న మాట నిజమే. అలా అని చిన్న కార్ల సెగ్మెంట్​ ఇక మాయమైపోతుందని అనుకుంటే పొరపాటే! ముఖ్యంగా చిన్న కార్లలో హ్యాచ్​బ్యాక్​ మోడల్స్​ను ఇప్పటికీ చాలా మంది భారతీయులు ప్రిఫర్​ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త మోడల్స్​ తీసుకొస్తున్నాయి ఆటో సంస్థలు. కొన్ని సంస్థలు.. ఇప్పటికే ఉన్న మోడల్స్​కు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లను లాంచ్​ చేస్తున్నాయి. ఈ విధంగా లాంచ్​ అయ్యిందే.. హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​​. సాధారణంగానే గ్రాండ్​ ఐ10 నియోస్​కు మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉంది. ఇక ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ కూడా దూసుకెళుతుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. చిన్న కార్ల సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతున్న మారుతీకి ఈ విధంగా గట్టిపోటీనిస్తోంది హ్యుందాయ్​. ఈ నేపథ్యంలో.. హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​ను మారుతీ సుజుకీ స్విఫ్ట్​తో పోల్చి.. ఈ రెండింట్లో ది బెస్ట్​ ఏదనేది ఇక్కడ తెలుసుకుందాము..

హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​ వర్సెస్​ మారుతీ సుజుకీ స్విఫ్ట్​- స్పెసిఫికేషన్స్​..

న్యూ హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​ పొడవు 3,815ఎంఎం, వెడల్పు 1,680ఎంఎం, ఎత్తు 1,520ఎంఎం ఉంటుంది. ఈ మోడల్​ వీల్​బేస్​ 2,450ఎంఎం. 15 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ కొత్తగా వస్తోంది.

Hyundai Grand i10 Nios 2023 : గ్రాండ్​ ఐ10 నియోస్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ కన్నా మారుతీ సుజుకీ స్విఫ్ట్​ కాస్త పెద్దది! నియోస్​ కన్నా దీని పొడవు 35ఎంఎం, వెడల్పు 55ఎంఎం, ఎత్తు 10ఎంఎం ఎక్కువగా ఉంటుంది. వీల్​బేస్​ మాత్రం ఒకే విధంగా ఉంది.

హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​ను మారుతీ సుజుకీ స్విఫ్ట్​- ఫీచర్స్​..

Maruti Suzuki Swift features : మారుతీ సుజుకీ స్విఫ్ట్​ కన్నా న్యూ హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​లో ఫీచర్స్​ అధికంగా ఉన్నాయి. గ్రాండ్​ ఐ10 నియోస్​లో 30కిపైగా సేఫ్టీ ఫీచర్స్​ ఉంటాయి. 6 ఎయిర్​బ్యాగ్స్​, హిల్​ అసిస్ట్​, పార్కింగ్​ అసిస్ట్​, థెఫ్ట్​ అలారం వంట ఫీచర్స్​ ఇందులో భాగం.

Maruti Brezza vs Maruti Fronx : మారుతీ బ్రెజా వర్సెస్​ మారుతీ ఫ్రాంక్స్​.. ఏది కొంటే బెటర్​? అన్న విషయం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇక గ్రాండ్​ ఐ10 నియోస్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ క్యాబిన్​లో 8 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ స్క్రీన్​, టైప్​- సీ ఛార్జింగ్​ పోర్ట్​, వయర్​లెస్​ ఛార్జింగ్​, రేర్​ ఏసీ వెంట్స్​, కూల్డ్​ గ్లోవ్​బాక్స్​ వంటివి లభిస్తున్నాయి. వీటితో పాటు గ్రాండ్​ ఐ10 నియోస్ ఫేస్​లిఫ్ట్​లో వచ్చిన​ మరిన్ని ఫీచర్స్​.. మారుతీ స్విఫ్ట్​లో లేవు.

న్యూ హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​ను మారుతీ సుజుకీ స్విఫ్ట్​- ఇంజిన్​..

New Hyundai Grand i10 Nios features : ఈ రెండు మోడల్స్​లోను 1.2 లీటర్​ 4 సిలిండర్​ ఇంజిన్​ ఉంది. రెండింట్లోనూ 5 స్పీడ్​ మేన్యువల్​, ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ లభిస్తోంది. కానీ పవర్​ ఔట్​పుట్​ పరంగా చూసుకుంటే.. హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​ కన్నా మారుతీ సుజుకీ స్విఫ్ట్​కు మార్కులు ఎక్కువ పడతాయి. గ్రాండ్​ ఐ10 నియోస్​ 83 పీఎస్​ పవర్​ను, 114 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. మరోవైపు మారుతీ స్విఫ్ట్​ 90 పీఎస్​ పవర్​ను, 113 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​ను మారుతీ సుజుకీ స్విఫ్ట్​- ధరలు..

New Hyundai Grand i10 Nios price : న్యూ హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​ మేన్యువల్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 5.68లక్షలు- రూ. 7.93లక్షల మధ్యలో ఉంటుంది. ఆటోమెటిక్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 7.23లక్షలు- రూ. 8.46లక్షల మధ్యలో ఉంటుంది. సీఎన్​జీ వేరియంట్ ఎక్స్​షోరూం​ ధర రూ. 7.56లక్షలు- రూ. 8.11లక్షల మధ్యలో ఉంటుంది.

Maruti Suzuki Swift on road price in Hyderabad : ఇక మారుతీ సుజుకీ స్విఫ్ట్​ మేన్యువల్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 5.91లక్షలు- రూ. 8.21లక్షల మధ్యలో ఉంది. ఆటోమెటిక్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 7.32లక్షలు- 8.71లక్షల మధ్యలో ఉంది. ఇక సీఎన్​జీ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 7.77లక్షలు- రూ. 8.45లక్షల మధ్యలో ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం