Maruti Suzuki Swift S CNG । స్విఫ్ట్ కారులో CNG వెర్షన్, మైలేజ్‌కు తిరుగేలేదు!
మారుతి సుజుకి స్విఫ్ట్ కారులో ఇప్పుడు CNG వెర్షన్ విడుదలైంది. Maruti Suzuki Swift S CNG ధరలు రూ. 7.77 నుంచి ప్రారంభమవుతున్నాయి. మైలేజ్ ఎంత? ఇతర వివరాలను తెలుసుకోండి.
మారుతి సుజుకి తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారులో ఇప్పుడు CNG వేరియంట్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ S-CNG కారు VXi అలాగే ZXi అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ CNG వెర్షన్ కారు ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 7.77 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ZXI ధర రూ. 8.45 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ అందించే సబ్‌స్క్రైబ్ స్కీమ్ ద్వారా నెలకు రూ. 16,499 చెల్లించి కూడా ఈ కారును సొంతం చేసుకోవచ్చు. కాగా, మారుతి సుజుకి నుంచి CNG పొందిన లైనప్‌లో ఇది తొమ్మిదవ కారు. స్విఫ్ట్ కారులో ఇప్పుడు CNG రాకతో ఇప్పుడు దేశంలో అత్యంత ఇంధన-సమర్థవంతమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇదేనని కంపెనీ పేర్కొంది.
కొత్తగా లాంచ్ అయిన ఈ మారుతి సుజుకి స్విఫ్ట్ S-CNG వెర్షన్ కారు సాలిడ్ ఫైర్ రెడ్, పెర్ల్ మెటాలిక్ మిడ్‌నైట్ బ్లూ, పెరల్ ఆర్కిటిక్ వైట్, పెరల్ మెటాలిక్ లూసెంట్ ఆరెంజ్, మెటాలిక్ మాగ్మా గ్రే, మెటాలిక్ సిల్కీ సిల్వర్ అనే ఆరు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
ఇంజిన్ కెపాసిటీ, మైలేజ్
2022 స్విఫ్ట్ S-CNG వేరియంట్‌లలో అధునాతన 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ 6,000rpm వద్ద 57kW (77.49PS) శక్తిని అలాగే 4300rpm వద్ద 98.5Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజన్ 6,000rpm వద్ద 89bhp అలాగే 4,400rpm వద్ద 113Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. S-CNG వెర్షన్ ప్రామాణికంగా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేసి వస్తుంది.
S-CNG వాహనం డ్యూయల్ ఇంటర్ డిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు (ECU), ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ కారణంగా వాహనం అత్యుత్తమ పనితీరు కనబర్చటంతో పాటు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. టెస్టింగ్ ఏజెన్సీ ధృవీకరించిన ప్రకారం, స్విఫ్ట్ S-CNG ఒక కిలోకు 30.90 km మైలేజ్ అందించగలదు.
భద్రత కోసం, తుప్పును నివారించడానికి అలాగే CNG నిర్మాణంలో లీకేజీని నిరోధించడానికి స్టెయిన్‌లెస్ స్టీల్ పైపులు ఇచ్చారు. ఇంకా, ఇంటిగ్రేటెడ్ వైరింగ్ సిస్టమ్ షార్ట్-సర్క్యూట్‌లను నివారిస్తుంది. అలాగే CNG ఫిల్లింగ్ ప్రక్రియలో ఇంజన్ స్టార్ట్ కాకుండా ఉండేలా చేస్తుంది. అయితే CNG కారణంగా కార్ బూట్ స్పేస్ తగ్గిపోతుంది. సాధారణంగా స్విఫ్ట్ 268 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది, CNG వేరియంట్‌లలో ఈ స్పేస్ గణనీయంగా తగ్గిపోతుంది.
కారు ఫీచర్ల విషయానికి వస్తే.. సాధారణ పెట్రోల్ వెర్షన్‌లో ఉన్నట్లుగానే స్విఫ్ట్ CNG వెర్షన్లోనూ ఫీచర్ లిస్ట్ అలాగే ఉంచారు. ZXi వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్, లెదర్ కవర్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ డోర్ ఆర్మ్‌రెస్ట్‌లో సిల్వర్ ఎలిమెంట్స్, ఎలక్ట్రిక్ ORVMలు, రియర్ డీఫాగర్, రియర్ వైపర్ , వాషర్ , ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్