Hyundai Grand i10 Nios facelift : హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ వచ్చేసింది!
Hyundai Grand i10 Nios facelift version : గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను హ్యుందాయ్ ఆవిష్కరించింది. కొత్త కొత్త అప్డేట్స్ ఈ మోడల్‌కు వచ్చాయి. ఆ వివరాలు..
Hyundai Grand i10 Nios facelift version unveiled : హ్యుందాయ్ మోటార్ జోరు మీద ఉంది. గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌కు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను తీసుకొచ్చింది. తన అధికారిక వెబ్సైట్లో ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను ఆవిష్కరించింది ఈ కొరియన్ ఆటోమేకర్. బుకింగ్స్‌ని కూడా ప్రారంభించేసింది. ఆన్లైన్లో రూ. 11వేల టోకెన్ అమోంట్తో ఈ 2023 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ను బుక్ చేసుకోవచ్చు. త్వరలో ప్రారంభంకానున్న 2023 ఆటో ఎక్స్‌పోలో ఈ మోడల్‌ను హ్యుందాయ్ లాంచ్ చేయనుంది.
గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్..
2023 గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో కొత్త ఫీచర్స్ కనిపిస్తున్నాయి. సేఫ్టీ ఫీచర్స్ కూడా పెరిగినట్టు తెలుస్తోంది. డిజైన్ పరంగానూ కొన్ని మార్పులు చేసింది హ్యుందాయ్. బ్లాక్ రేడియేటర్ గ్రిల్, ఎల్ఈడీ డీఆర్ఎల్లలో మార్పులు చూడవచ్చు. 15 ఇంచ్ అలాయ్ వీల్స్ వచ్చాయి. కొత్తగా వచ్చిన టెయిల్‌లైట్ యూనిట్ రిఫ్రెషింగ్‌గా ఉంది.
Hyundai Grand i10 Nios facelift launch : గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను మరిన్ని రంగుల్లో అందుబాటులో ఉంచనుంది హ్యుందాయ్. స్పార్క్ గ్రీన్ సహా మొత్తం ఆరు ఆప్షన్లు ఇప్పుడు ఉన్నాయి. ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. మేన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది.. 83 పీఎస్ పవర్‌ను, 113.8 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మేన్యువల్ గేర్‌బాక్స్‌తో సీఎన్జీ వర్షెన్‌ను కూడా ఆఫర్ చేస్తోంది హ్యుందాయ్. గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీ వర్షెన్.. 69 పీఎస్ పవర్‌ను, 95.2 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
2023 MG Hector facelift వర్షెన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ఇంటీరియర్ విషయానికొస్తే.. కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అడిషనల్ యూఎస్బీ- సీ ఛార్జింగ్ పోర్ట్స్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, వయర్లెస్ ఛార్జింగ్‌తో పాటు మరిన్ని ఫీచర్స్ లభిస్తున్నాయి.
Hyundai Grand i10 Nios facelift price : గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో క్రూయిజ్ కంట్రోల్, ఈఎస్సీ, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్ వంటివి కొత్తగా చేరాయి. 4 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్గాను, 6 ఎయిర్‌బ్యాగ్స్ ఆప్షనల్గాను ఇస్తోంది హ్యుందాయ్. పిల్లల సేఫ్టీ కోసం రేర్‌లో ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ ఫీచర్‌ను అదనంగా జోడించింది ఈ దిగ్గజ ఆటో సంస్థ.
Grand i10 Nios 2023 : ఈ మోడల్‌కు సంబంధించిన ధరతో పాటు పూర్తి వివరాలు.. కొన్ని రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం.. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధర రూ. 5.54లక్షలు- రూ. 8.55లక్షల (ఎక్స్‌షోరూం) మధ్యలో ఉంది.
సంబంధిత కథనం