2023 MG Hector facelift : ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ఫస్ట్​ లుక్​.. అదిరిందిగా!-2023 mg hector facelift first look style and tech receives good updates ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2023 Mg Hector Facelift : ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ఫస్ట్​ లుక్​.. అదిరిందిగా!

2023 MG Hector facelift : ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ఫస్ట్​ లుక్​.. అదిరిందిగా!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 08, 2023 02:04 PM IST

2023 MG Hector facelift : ఎంజీ హెక్టార్​కు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వస్తోంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్​ లుక్​ బయటకొచ్చింది. ఆ వివరాలు..

ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​
ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​

2023 MG Hector facelift : ఇండియా ఆటో మార్కెట్​లో ఎంజీ మోటార్​​ దూసుకెళుతోంది. నెలనెలా మంచి సేల్స్​ను నమోదు చూస్తూ ముందుకెళుతోంది. ఈ క్రమంలోనే కొత్త లాంచ్​లతో కస్టమర్లకు ఆకర్షిస్తోంది. ఇక ఇప్పుడు.. ఎంజీ హెక్టార్​కు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను తీసుకొచ్చింది. ఈ ఎస్​యూవీకి సంబంధించిన ఫస్ట్​ లుక్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఎంజీ హెక్టార్​ అప్డేటెడ్​ వర్షెన్​..

2019లో హెక్టార్​ మోడల్​ను ఇండియాలో లాంచ్​ చేసింది ఎంజీ మోటార్​. ఈ సంస్థ నుంచి ఇండియాలో వచ్చిన మొదటి ప్రాడెక్ట్​ ఇదే. కొన్ని రోజుల్లోనే మార్కెట్​లో దీనికి మంచి డిమాండ్​ కనిపించింది. సెకెండ్​ జెన్​ క్రేటా, గ్రాండ్​ విటారా, అర్బన్​ క్రూయిజర్​ హైరైడర్​తో పాటు త్రీ రో ఎస్​యూవీలు ఎక్స్​యూవీ700, సఫారీకి కూడా ఇది పోటీనిస్తోంది.

2023 MG Hector : ఇక 2023 ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​ ఫస్ట్​ లుక్​ ఆదివారమే బయటకొచ్చింది. లుక్స్​ చాలా రిఫ్రెషింగ్​గా ఉన్నాయి. ఈ హెక్టార్​ మోడల్​కు సంబంధించిన ధరలను త్వరలో జరగనున్న ఆటో ఎక్స్​పోలో ప్రకటించనుంది ఎంజీ మోటార్​.

కొత్త ఎంజీ హెక్టార్​లో గ్రిల్స్​ చాలా ఇంప్రెసివ్​గా ఉన్నాయి. పాత మోడల్​తో పోల్చుకుంటే సైజ్​లోనూ పెద్దగా ఉన్నాయి. వీటిని 'ఆగ్రీలీ ఇన్​స్పైర్డ్​ డైమండ్​ మెష్​ గ్రిల్​' అని పిలిస్తోంది ఎంజీ మోటార్​. లెక్సస్​ మోడల్స్​తో ఈ గ్రిల్స్​ పోలి ఉన్నాయి.

2023 MG Hector facelift features : 2023 ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో స్ప్లిట్​ హెడ్​ల్యాంప్​ సెటప్​ ఉంటుంది. పాత మోడల్​లోనూ ఇలాగే ఉండేది. ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ ల్యాంప్స్​తో కూడిన టాప్​ పార్ట్​ కూడా మారలేదు. ఫ్రెంట్​ బంపర్​కు మాత్రం డిజైన్​ పరంగా స్వల్ప మార్పులు చేసింది ఆటో సంస్థ. కానీ దృష్టి పెట్టి చూస్తే తప్ప ఈ డిఫరెన్స్​ కనిపించదు!

ఈ కొత్త ఎంజీ హెక్టార్​లో ఆలాయ్​ వీల్స్​.. పాత దానితో పోలి ఉన్నాయి. రేర్​లో మాత్రం కనెక్టెడ్​ టెయిల్​ ల్యాంప్స్​ విత్​ న్యూ ఇన్​సర్టర్స్​ వస్తున్నాయి. షేప్​ మాత్రం పాత వర్షెన్​తో పోలి ఉంది.

2023 MG Hector facelift auto expo 2023 : ఇక 2023 ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​ ఫీచర్స్​ విషయానికొస్తే.. టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ కొత్తగా ఉంది. పాత మోడల్​లో 10 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఉండగా.. ఇప్పుడది 14 ఇంచ్​కు పెరిగింది. ఈసారి ఫుల్​ హెచ్​డీ కూడా లభిస్తోంది. ఇందులో 360 డిగ్రీ కెమెరా కూడా ఉంది. ఇది 3డీ మోడ్​లో కూడా వస్తుండటం విశేషం.

కొత్త ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​లో ఏడీఏఎస్​ ఫీచర్​ను యాడ్​ చేశారు. క్రూయిజ్​ కంట్రోల్​ ఆన్​లో ఉన్నప్పుడు.. కర్వ్​డ్​ రోడ్డు వస్తే.. వెహికిల్​ దాని అంతట అదే స్పీడ్​ను అడ్జెస్ట్​ చేసుకునే ఆప్షన్​ ఇది. ట్రాఫిక్​ జామ్​ అసిస్ట్​ ఫీచర్​ కూడా వస్తోంది. బ్లూటూత్​ ఎనేబుల్డ్​ యాక్సెస్​ కూడా కొత్తగా వచ్చింది. ఈసారి ఫుల్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ ఇచ్చింది సంస్థ.

2023 ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​ ఇంజిన్​..

2023 ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​లో ఇంజిన్​ ఆప్షన్​ మారలేదు. ఇందులో 1.5లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది. కాగా.. 5స్పీడ్​ మేన్యువల్​ లేదా సీవీటీ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉంటాయి. మైల్డ్​ హైబ్రీడ్​ టెక్​ లేదు. 7స్పీడ్​ డీసీటీ గేర్​బాక్స్​ని కూడా తప్పించారు.

డీజిల్​ ఇంజిన్​ కూడా మారలేదు. 170హెచ్​పీ 2.0 లీటర్​ డీజిల్​ ఇంజిన్​తోనే 2023 ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​ వస్తోంది.

2023 ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​ బుకింగ్స్​..

2023 MG Hector facelift bookings : 2023 ఆటో ఎక్స్​పో తర్వాత.. ఈ 2023 ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​ బుకింగ్స్​ మొదలయ్యే అవకాశం ఉంది.

Whats_app_banner