తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kawasaki Electric Bikes : కవాసకి నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్​ బైక్స్​.. లాంచ్​ ఎప్పుడంటే!

Kawasaki electric bikes : కవాసకి నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్​ బైక్స్​.. లాంచ్​ ఎప్పుడంటే!

11 November 2022, 12:05 IST

    • Kawasaki Z and Ninja electric bike : రెండు కొత్త ఎలక్ట్రిక్​ బైక్స్​తో మార్కెట్​లోకి రానుంది కవాసకి. వచ్చే ఏడాదిలో వీటిని లాంచ్​ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
కవాసకి జెడ్​, నింజా ఎలక్ట్రిక్​ బైక్స్​
కవాసకి జెడ్​, నింజా ఎలక్ట్రిక్​ బైక్స్​ (HT Auto)

కవాసకి జెడ్​, నింజా ఎలక్ట్రిక్​ బైక్స్​

Kawasaki electric bikes : 2022 ఈఐసీఎంఏలో.. రెండు కొత్త ఎలక్ట్రిక్​ బైక్స్​ని ఆవిష్కరించింది కవాసకి. వచ్చే ఏడాదిలో వీటిని లాంచ్​ చేయనుంది. ఈ రెండు ఎలక్ట్రిక్​ బైక్స్​.. జెడ్​, నింజా మోడల్స్​కు చెందినవి. యూరోపియన్​ ఏ1 వెహికిల్​ లైసెన్స్​ రెగ్యులేషన్స్​కు తగ్గట్టుగా ఈ రెండు ఎలక్ట్రిక్​ బైక్స్​ని రూపొందిస్తున్నట్టు సంస్థ పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

ఈ జెడ్​, నింజా ఎలక్ట్రిక్​ బైక్స్​.. ప్రస్తుతానికి ప్రోటోటైప్​ దశలో ఉన్నాయి. ఈ రెండింటికి ఒకటే పవర్​ట్రైన్​ ఉంటుందని తెలుస్తోంది. 3కేడబ్ల్యూహెచ్​ కెపాసిటీతో కూడిన డ్యుయెల్​ బ్యాటరీ సెటప్​ వీటిల్లో ఉండొచ్చు. ఈ ప్రోటోటైప్స్​ ఆధారంగానే ప్రొడక్షన్​ను ప్రారంభిస్తారు. కవాసకి నుంచి వస్తున్న ఈ రెండు ఎలక్ట్రిక్​ బైక్స్​కు 125సీసీ పెట్రోల్​ ఇంజిన్​ ఉండే అవకాశం ఉంది.

Kawasaki Z electric bike : వీటికి సంబంధించిన ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​ వంటి అంశాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. వీటిపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

కాగా.. రేర్​ వీల్​ను స్పిన్​ చేసేందుకు చెయిన్​ డ్రైవ్​తో కూడిన ఎలక్ట్రిక్​ మోటార్​ ఉంటుందని తెలుస్తోంది. రెండువైపులా డిస్క్​ బ్రేక్స్​ ఉండొచ్చు. ఫ్రంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో మోనో షాక్​తో బైక్​ సస్పెన్షన్​ యాక్టివిటీ జరగొచ్చు.

కవాసకి జెడ్​250 నేకిడ్​ స్ట్రీట్​ మోటర్​సైకిల్​ స్ఫూర్తితో ఈ జెడ్​ ఎలక్ట్రిక్​ బైక్​ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ జెడ్​250 ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్​లో అందుబాటులో ఉంది. ఫ్యుయెల్​ ట్యాంక్​, హెడ్​ల్యాంప్​తో పాటు పూర్తి డిజైన్​ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Kawasaki Ninja electric bike : కవాసకి నింజా ఎలక్ట్రిక్​ బైక్​ను.. నింజా ఫ్యామిలీ ఆధారంగా రూపొందించనున్నారు. కానీ సైజు విషయానికొస్తే.. ఈ ఎలక్ట్రిక్​ బైక్​.. నింజా 250లాగా కనిపిస్తోంది. ఫ్రంట్​లో అగ్రెసివ్​ హెడ్​ల్యాంప్​ ఉంది.

కానీ ప్రొటోటైప్​ చూసి ఎలక్ట్రిక్​ బైక్​ల డిజైన్​ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. అందుకే.. కవాసకి ఎలక్ట్రిక్​ బైక్స్​ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు!