2023 Kawasaki Ninja ZX-10R । కవాసకి నుంచి సూపర్ స్పోర్ట్స్ బైక్.. ఏంటి స్పెషల్?-2023 kawasaki ninja zx 10r sports bike launched in india check price details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  2023 Kawasaki Ninja Zx-10r । కవాసకి నుంచి సూపర్ స్పోర్ట్స్ బైక్.. ఏంటి స్పెషల్?

2023 Kawasaki Ninja ZX-10R । కవాసకి నుంచి సూపర్ స్పోర్ట్స్ బైక్.. ఏంటి స్పెషల్?

HT Telugu Desk HT Telugu
Sep 13, 2022 02:48 PM IST

కవాసకి మోటార్‌సైకిల్‌ బ్రాండ్ భారత మార్కెట్లో 2023 Kawasaki Ninja ZX-10R స్పోర్ట్స్‌బైక్‌ను విడుదల చేసింది. ఈ సూపర్ బైక్ ధర, ఇతర విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.

2023 Kawasaki Ninja ZX-10R
2023 Kawasaki Ninja ZX-10R

జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ బ్రాండ్ కవాసకి మోటార్స్ ఈరోజు భారత మార్కెట్లో సరికొత్త 2023 నింజా ZX-10R స్పోర్ట్స్‌బైక్‌ను విడుదల చేసింది. ఈ సూపర్ బైక్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 15.99 లక్షలుగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అవుట్‌గోయింగ్ మోడల్ కంటే ఈ కొత్త బైక్ సుమారు రూ. 85,000 ఖరీదైనది. అయితే ఈ కొత్త బైక్‌కు అలాగే ఇప్పుడు లభ్యమవుతోన్న పాత వెర్షన్‌కు మధ్య చెప్పుకోదగ్గ గణనీయమైన మార్పులేమి లేవు. యాంత్రికంగా అదే పాత మోడల్ బైక్‌కు సమానమైన ఇంజన్‌ను కలిగి ఉంది. అయితే డిజైన్ పరంగా కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి.

2023 Kawasaki Ninja ZX-10R పూర్తిగా కొన్ని కాస్మెటిక్ నవీకరణలతో వచ్చింది. ఈ సూపర్ బైక్ రెండు కలర్ స్కీమ్‌లలో లభ్యమవుతోంది. కవాసకి సాంప్రదాయ లైమ్ గ్రీన్ పెయింట్ స్కీమ్‌తో పాటు కొత్త పెర్ల్ రోబోటిక్ వైట్ కలర్ ఆప్షన్‌లో అందిస్తున్నారు. అలాగే గ్రాఫిక్స్‌ కూడా కొత్తగా ఉన్నాయి. బైక్ మధ్యలో ఇంటెక్‌తో కూడిన ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది. ఇది ఇరుకైన టెయిల్ సెక్షన్, సింగిల్ సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్‌ను కలిగి ఉంది.

2023 Kawasaki Ninja ZX-10R ఇంజన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

2023 కవాసకి నింజా ZX-10R మోటార్‌సైకిల్‌లో 998cc సామర్థ్యం కలిగిన ఇన్-లైన్ 4-సిలిండర్ ఇంజన్ అమర్చారు. ఇది 13,200rpm వద్ద 203hp శక్తిని అలాగే 11,400rpm వద్ద 114.9Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో స్పోర్ట్, రోడ్, రెయిన్, రైడర్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.

ఇతర హార్డ్‌వేర్‌ అంశాలను పరిశీలిస్తే.. పూర్తిగా సర్దుబాటు చేయగల ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు మోనోషాక్‌ను కలిగి ఉంది. బ్రేకింగ్ హార్డ్‌వేర్‌లో ముందువైపు డ్యూయల్ 330mm డిస్క్‌లు, వెనుకవైపున 220mm డిస్క్‌ బ్రేక్స్ ఉన్నాయి. అలాగే కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి.

అదనంగా, Rideology యాప్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను 4.3-అంగుళాల TFT డిస్‌ప్లేకు జత చేయవచ్చు, ఇది నోటిఫికేషన్ అలర్ట్ లను అలాగే టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను పొందడానికి అనుమతిస్తుంది.

2023 నింజా ZX-10R భారతీయ రోడ్లపై హోండా CBR1000RR-R వంటి లీటర్-క్లాస్ సూపర్‌బైక్‌లతో పోటీపడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్