తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kawasaki W175 । రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా.. కవాసకి రెట్రో స్టైల్ మోటార్‌సైకిల్‌

Kawasaki W175 । రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా.. కవాసకి రెట్రో స్టైల్ మోటార్‌సైకిల్‌

HT Telugu Desk HT Telugu

25 September 2022, 17:30 IST

    • కవాసకి తాజాగా తమ బ్రాండ్ నుంచి సరికొత్త Kawasaki W175 రెట్రో స్టైల్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఇది కవాసకి నుంచి తొలి మేడ్- ఇన్ ఇండియా బైక్, దీని ధర, ఇతర వివరాలు చూడండి.
Kawasaki’s W175
Kawasaki’s W175

Kawasaki’s W175

జపనీస్ ఆటోమొబైల్ బ్రాండ్ కవాసకి మోటార్స్ నుంచి ఎంతగానో ఎదురుచూసిన రెట్రో మోడల్ Kawasaki W175 మోటార్‌సైకిల్‌ ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల అయింది. ఈ మోటార్‌సైకిల్‌ను కవాసకి పూర్తిగా భారతదేశంలోనే రూపొందించింది. ఇది కవాసకి నుంచి వచ్చిన ఎంట్రీలెవల్ మోటార్‌సైకిల్‌. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ వద్ద ఈ బైక్ ధరలు రూ. 1.47,000 నుంచి ప్రారంభమవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Brinjal in Pregnancy: గర్భిణులు వంకాయలు తినకూడదని ఆయుర్వేదం ఎందుకు చెబుతోంది?

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

కవాసకి ఈ వింటేజ్ మోడల్ మోటార్‌సైకిల్‌ను రెండు కలర్ వేరియంట్లలో విడుదల చేసింది. స్టాండర్డ్ వేరియంట్ ఎబోనీ బ్లాక్ కలర్ స్కీములో అందిస్తుండగా, మరొకటి స్పెషల్ ఎడిషన్ వేరియంట్. ఈ మోడల్ క్యాండీ పెర్సిమోన్ రెడ్ కలర్‌లో అందించారు. స్పెషల్ ఎడిషన్ మోడల్ దాని ప్రామాణిక స్టాండర్డ్ వేరియంట్ కంటే రూ. 2 వేలు ఖరీదైనది. ఇది ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 1.49,000గా ఉంది.

సరికొత్త Kawasaki W175 లుక్ పరంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, Jawa లాంటి మోడళ్లకు పోటీనిస్తుండగా, సామర్థ్యం పరంగా బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచే, రోనిన్, యమహా FZ వంటి సెగ్మెంట్ మోటార్ సైకిళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది.

Kawasaki W175 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

Kawasaki W175 పరిశీలిస్తే రౌండ్ హెడ్‌ల్యాంప్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, విభజనలేని సింగిల్ ప్యాడెడ్ సీటు, వెనకవైపు పాత తరం టెయిల్ లైట్, ఇండికేటర్‌లు ఉన్నాయి. అలాగే ఈ బైక్ సన్నని వైర్-స్పోక్డ్ వీల్స్‌పై నడుస్తుంది.

బైక్ ముందువైపున టెలీస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపున ట్విన్ షాక్ అబ్జార్బర్స్‌తో సస్పెన్షన్ ఇచ్చారు. అలాగే బ్రేకింగ్ ఫంక్షనాలిటీ కోసం ముందువైపు సింగిల్ ఛానల్ డిస్క్ బ్రేక్ ఇవ్వగా, వెనుకవైపు డ్రమ్ బ్రేక్ ఇచ్చారు.

Kawasaki W175 ఇంజన్ సామర్థ్యం

Kawasaki W175లో 177 cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. దీనిని 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. ఇది BS6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇంధనం-ఇంజెక్ట్ చేస్తుంది. ఈ ఇంజన్ 13.05 HP శక్తిని అలాగే 13.2 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది.

ఈ బైక్ లీటరుకు 40-45 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుందని మార్కెట్ నిపుణుల అంచనా.

Kawasaki W175 లభ్యత

కవాసకి W175 మోటార్‌సైకిల్ తమ ఆథరైజ్డ్ డీలర్‌షిప్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. బుకింగ్‌లు ఈరోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. డెలివరీలు డిసెంబర్ 2022 నుంచి నిర్వహించనున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం