తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Sales: హ్యుందాయ్ కార్ల జోరు.. సేల్స్ 33 శాతం అప్

Hyundai sales: హ్యుందాయ్ కార్ల జోరు.. సేల్స్ 33 శాతం అప్

HT Telugu Desk HT Telugu

01 November 2022, 16:34 IST

  • Hyundai sales: హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు అక్టోబరులో 33 శాతం పెరిగాయి.

అక్టోబరులో పెరిగిన హ్యుందాయ్ కార్ల విక్రయాలు
అక్టోబరులో పెరిగిన హ్యుందాయ్ కార్ల విక్రయాలు (REUTERS)

అక్టోబరులో పెరిగిన హ్యుందాయ్ కార్ల విక్రయాలు

Hyundai sales: హ్యుందాయ్ మోటార్ ఇండియా అక్టోబరులో 58,006 యూనిట్ల కార్లను అమ్మింది. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే అమ్మకాలు 33 శాతం పెరిగాయి. అక్టోబరు నెలకు సంబంధించిన విక్రయ గణాాంకాలను హ్యుందాయ్ మోటార్స్ మంగళవారం ప్రకటించింది. గత ఏడాది అక్టోబరులో కంపెనీ 43,556 యూనిట్లు విక్రయించింది.

హ్యుందాయ్ మోటార్స్ అక్టోబరులో దేశీయంగా 48,001 యూనిట్లను అమ్మింది. అంటే 30 శాతం వృద్ధి కనబరిచింది. గత ఏడాది డొమెస్టిక్ సేల్స్ 37,021గా ఉన్నాయి.

గత ఏడాది అక్టోబరులో ఎగుమతులు 6,535 యూనిట్లు ఉండగా ఈ ఏడాది అక్టోబరులో 53 శాతం పెరిగి 10,005 యూనిట్లుగా నమోదయ్యాయి.

కాగా మారుతీ సుజుకీ ఇండియా అక్టోబరు అమ్మకాల్లో 21 శాతం వృద్ధిని సాధించింది. అయితే ఈ కంపెనీ వాహనాల ఎగుమతులు భారీగా తగ్గాయి.

అలాగే టాటా మోటార్స్ కూడా అక్టోబరు అమ్మకాల్లో 15.5 శాతం వృద్ధిని సాధించింది.

అక్టోబరు మాసంలో దసరా, దీపావళి పండగలు రావడంతో దేశీయంగా కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి.

అయితే అక్టోబరు మాసంలో బజాజ్ ఆటో అమ్మకాలు గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ముఖ్యంగా ఎగుమతులు తగ్గడంతో మొత్తం అమ్మకాల సంఖ్యపై ప్రభావం చూపింది.

అశోక్ లేలాండ్ అమ్మకాల్లో వృద్ధి

వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ మొత్తం అమ్మకాలు అక్టోబర్ 2022లో 34 శాతం పెరిగి 14,863 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ 11,079 యూనిట్లను విక్రయించినట్లు అశోక్ లేలాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశీయ విక్రయాలు 13,860 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది నెలలో 10,043 యూనిట్లు నమోదయ్యాయి. అంటే 38 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతులు గత ఏడాది అక్టోబర్‌లో 1,036 యూనిట్ల నుంచి 1,003 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి.