Tata Motors sales: టాటా మోటార్స్ సేల్స్ 15.5 శాతం జంప్
Tata Motors sales: టాటా మోటార్స్ అమ్మకాలు అక్టోబరులో 15.5 శాతం పెరిగాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 1: టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలు 2022 అక్టోబర్‌లో 15.49 శాతం పెరిగి 78,335 యూనిట్లుగా నమోదయ్యాయి.
గత ఏడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 67,829 యూనిట్లను విక్రయించినట్లు టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
మొత్తం దేశీయ విక్రయాలు 17 శాతం వృద్ధితో 65,151 యూనిట్ల నుంచి 76,537 యూనిట్లకు పెరిగాయి.
దేశీయ విపణిలో ఎలక్ట్రిక్ వాహనాలతో సహా ప్యాసింజర్ వెహికల్ (పివి) విక్రయాలు 33 శాతం వృద్ధితో 34,155 యూనిట్ల నుంచి 45,423 యూనిట్లకు పెరిగాయి.
ప్యాసింజర్ వెహికిల్స్ ఎగుమతులు అక్టోబర్ 2021లో 230 యూనిట్ల నుండి 10 శాతం తగ్గి 206 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 4,277 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలలో 1,660 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది.
దేశీయ విపణిలో వాణిజ్య వాహనాల విక్రయాలు గత ఏడాది అక్టోబరులో 31,226 యూనిట్లతో పోలిస్తే స్వల్పంగా 31,320 యూనిట్లకు తగ్గాయి. అయితే అక్టోబర్ 2021తో పోలిస్తే ఎగుమతులు 35 శాతం తగ్గి 1,592 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది అక్టోబరులో ఎగుమతులు 2,448గా నమోదయ్యాయి.
మారుతీ సుజుకీ సేల్స్ కూడా అక్టోబరులో భారీగా పెరిగాయి. 21 శాతం మేర వాటి విక్రయాలు పెరిగాయి. అయితే దేశీయంగా అమ్మకాల్లో వృద్ధి ఉన్నప్పటికీ ఎగుమతులు తగ్గాయి.
ఇక బజాజ్ ఆటో అమ్మకాలు తగ్గాయి. వాటి దేశీయ అమ్మకాలు పెరిగినప్పటికీ ఎగుమతులు భారీగా తగ్గాయి.