Bajaj Auto sales: బజాజ్ ఆటో సేల్స్ అక్టోబర్‌లో 10 శాతం డౌన్-bajaj auto s total sales fall 10 pc to 3 95 238 units in october ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Bajaj Auto's Total Sales Fall 10 Pc To 3,95,238 Units In October

Bajaj Auto sales: బజాజ్ ఆటో సేల్స్ అక్టోబర్‌లో 10 శాతం డౌన్

HT Telugu Desk HT Telugu
Nov 01, 2022 11:39 AM IST

Bajaj Auto sales: అక్టోబరులో బజాజ్ ఆటో మొత్తం విక్రయాలు 10 శాతం తగ్గాయి. మొత్తంగా 3,95,238 యూనిట్లను విక్రయించగలిగింది.

అక్టోబరులో తగ్గిన బజాజ్ ఆటో ఎగుమతులు
అక్టోబరులో తగ్గిన బజాజ్ ఆటో ఎగుమతులు (MINT_PRINT)

Bajaj Auto sales: బజాజ్ ఆటో అక్టోబరు మాసంలో అమ్మకాలకు సంబంధించి గణాంకాలను వెల్లడించింది. మొత్తం అమ్మకాలు పది శాతం తగ్గికి 3,95,238 యూనిట్లకు పడిపోయాయి.

ట్రెండింగ్ వార్తలు

గత ఏడాది ఇదే మాసంలో 4,39,615 యూనిట్లు అమ్మినట్టు బజాజ్ ఆటో ఒక నివేదికలో వెల్లడించింది.

దేశీయంగా అమ్మకాలు 11 శాతం పెరిగి 2,42,917 యూనిట్లకు చేరున్నాయి. 2021 అక్టోబరులో ఈ అమ్మకాలు 2,18,565 యూనిట్లుగా ఉన్నాయి.

అయితే బజాజ్ ఆటో ఎగుమతులు 31 శాతం తగ్గి 1,52,321 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబరులో ఎగుమతులు 2,21,050 యూనిట్లుగా ఉన్నాయి.

దేశీయంగా టూ వీలర్ అమ్మకాలు 4 శాతం పెరిగి 2,06,131 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే మాసంలో 1,98,738 యూనిట్లు అమ్మింది.

ఇక టూ వీలర్ ఎగుమతులు 29 శాతం పడిపోయి 1,35,772 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాది అక్టోబరులో టూ వీలర్ ఎగమతులు 1,92,565 యూనిట్లుగా ఉన్నాయి.

వాణిజ్య వాహనాలు 10 శాతం పెరిగి 53,335 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకుముందు ఏడాది ఇదే మాసంలో 48,312 యూనిట్లు అమ్ముడయ్యాయి.

దేశీయంగా కమర్షియల్ వెహికిల్స్ అమ్మకాలు 86 శాతం పెరిగాయి. మొత్తం 36,786 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే మాసంలో 19,827 యూనిట్లు మాత్రమే అమ్మింది. ఎగుమతులు 42 శాతం తగ్గిపోయి 16,549 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాది ఇదే మాసంలో ఎగుమతులు 28,486 యూనిట్లు ఉన్నట్టు బజాజ్ ఆటో కంపెనీ తెలిపింది.

WhatsApp channel