Maruti Suzuk sales rise: మారుతీ సుజుకీ దూకుడు.. 21 శాతం పెరిగిన సేల్స్-maruti suzuki total sales rise 21 percent to 167520 units in october
Telugu News  /  Business  /  Maruti Suzuki Total Sales Rise 21 Percent To 167520 Units In October
అక్టోబరులో మారుతీ సుజుకీ చిన్న కార్ల సెగ్మెంట్‌లో విక్రయాల జోరు
అక్టోబరులో మారుతీ సుజుకీ చిన్న కార్ల సెగ్మెంట్‌లో విక్రయాల జోరు (PTI)

Maruti Suzuk sales rise: మారుతీ సుజుకీ దూకుడు.. 21 శాతం పెరిగిన సేల్స్

01 November 2022, 13:08 ISTHT Telugu Desk
01 November 2022, 13:08 IST

Maruti Suzuk sales rise: అక్టోబరు నెలలలో మారుతీ సుజుకీ కార్ల అమ్మకాలు 21 శాతం పెరిగాయి.

న్యూఢిల్లీ, నవంబర్ 1: అక్టోబర్‌ నెలలో మొత్తం అమ్మకాలు 21 శాతం పెరిగి 1,67,520 యూనిట్లుగా నమోదయ్యాయని వాహన తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) తెలిపింది.

గత ఏడాది ఇదే నెలలో మొత్తం 1,38,335 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు అక్టోబర్‌లో 1,47,072 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది నెలలో 1,17,013 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే 26 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఆల్టో, ఎస్-ప్రెస్సోతో కూడిన మినీ కార్ల సెగ్మెంట్ విక్రయాలు అక్టోబర్ 2021లో 21,831 యూనిట్ల నుండి ఇప్పుడు 24,936 యూనిట్లకు పెరిగాయి.

బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్-ఎస్, వ్యాగన్ఆర్‌తో సహా కాంపాక్ట్ కార్ల విక్రయాలు 48,690 యూనిట్ల నుంచి 73,685 యూనిట్లకు పెరిగాయి.

బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్6 లతో కూడిన యుటిలిటీ వాహనాలు గత నెలలో 30,971 యూనిట్ల అమ్మకాలను సాధించాయి. గత ఏడాది ఇదే కాలంలో 27,081 యూనిట్లు అమ్ముడుపోయాయి.

ఈకో అమ్మకాలు అక్టోబర్ 2021లో 10,320 యూనిట్లు ఉండగా.. ఇప్పుడు 8,861 యూనిట్లకు పడిపోయాయి. అదేవిధంగా లైట్ కమర్షియల్ వెహికిల్ సూపర్ క్యారీ అమ్మకాలు గత ఏడాది అక్టోబరులో 3,797 యూనిట్లు ఉండగా.. ఈ అక్టోబరులో 2,913 యూనిట్లకు పడిపోయాయి.

గత ఏడాది అక్టోబర్‌లో ఎగుమతులు 21,322 యూనిట్లు ఉండగా, స్వల్పంగా తగ్గి ఈ ఏడాది అక్టోబరులో 20,448 యూనిట్లుగా నమోదయ్యాయని మారుతీ సుజుకీ తెలిపింది.

టాపిక్