How to link credit card to UPI : క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేయడం ఎలా?
17 February 2023, 11:06 IST
- How to link credit card to UPI : మీ క్రెడిట్ కార్డ్‌ను యూపీఐకి లింక్ చేయాలని చూస్తున్నారా? ఆ ప్రక్రియ మీకు తెలియడం లేదా? అయితే ఈ కథనం మీకోసమే..
యూపీఐతో క్రెడిట్ కార్డును ఎలా లింక్ చేయాలి?
How to link credit card to UPI : దేశంలో ప్రతి నెలా రికార్డుస్థాయిలో యూపీఐ ట్రాన్సాక్షన్లు అవుతున్నాయి. ఇప్పుడందరు యూపీఐ ద్వారానే పేమెంట్స్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. చాలా సులభంగా లావాదేవీలు జరిగిపోతుండటం ఇందుకు ముఖ్య కారణం. ఇప్పటివరకు డెబిట్ కార్డ్‌లనే లింక్ చేసే వెసులుబాటు ఉండేది. ఇక ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌లను కూడా యూపీఐకి లింక్ చేసేందుకు ఆర్బీఐ అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చేప్పింది. రూపే క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ సేవలు ప్రారంభించినట్టు పేర్కొంది. ఫలితంగా ఈ సేవలు అందిస్తున్న.. దేశంలోనే తొలి ప్రైవేట్ బ్యాంక్‌గా నిలిచింది. ఇప్పుడిక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌ను యూపీఐ ఐడీతో లింక్ చేసుకోవచ్చు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో పాటు ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు ఈ వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. యూపీఐ ఐడీతో క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేసే ప్రక్రియను ఇక్కడ తెలుసుకుందాము..
క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేయడం ఎలా?
HDFC bank credit card UPI services : స్టెప్ 1:- ముందుగా మీ యూపీఐ యాప్ ఓపెన్ చేయండి.
స్టెప్ 2:- బ్యాంక్ అకౌంట్స్ సెక్షన్‌కు వెళ్లండి.
స్టెప్ 3:- క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలక్ట్ చేయండి.
స్టెప్ 4:- మీ బ్యాంక్ అకౌంట్ పేరు మీద క్లిక్ చేయండి.
స్టెప్ 5:- సంబంధిత బ్యాంక్‌కు చెందిన క్రెడిట్ కార్డ్స్ డిస్ప్లే అవుతాయి.
స్టెప్ 6:- కార్డ్ సెలక్ట్ చేసి, కన్ఫర్మ్ చేయండి.
స్టెప్ 7:- సెలక్ట్ చేసిన కార్డ్‌కు యూపీఐ పిన్ సెటప్ చేయండి. అప్పుడు మీ కార్డ్ యాడ్ అవుతుంది. మీరు ఇక క్రెడిట్ కార్డ్‌ను యూపీఐతో ఉపయోగించుకోవచ్చు.
(యూపీఐతో క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేసేందుకు ఇది సాధారణ ప్రక్రియ. కొన్ని సందర్భాల్లో బ్యాంక్‌ల బట్టి ఈ ప్రక్రియ మారే అవకాశం ఉంది.)
జాగ్రత్తగా ఖర్చు చేయండి..!
Credit card UPI payment : డెబిట్ కార్డ్‌ను యూపీఐకి లింక్ చేయడం వేరు.. క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేయడం వేరు! ఫోన్లో సింగిల్ క్లిక్‌తో ఇప్పుడు డబ్బులు ఖర్చు చేసేయవచ్చు. ఇక క్రెడిట్ కార్డ్‌లను మితిమీరి ఖర్చు చేస్తే.. ఆ తర్వాత మనమే కష్టపడాలి. క్రెడిట్ స్కోరు దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.