తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rates Today : పెరిగిన పసిడి, దిగొచ్చిన వెండి ధరలు..

Gold and silver rates today : పెరిగిన పసిడి, దిగొచ్చిన వెండి ధరలు..

13 November 2022, 6:10 IST

    • Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు పెరిగాయి. అదే సమయంలో వెండి ధరలు తగ్గాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (REUTERS)

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 పెరిగి.. రూ. 48,200కి చేరింది. శనివారం ఈ ధర రూ. 47,800గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4000 పెరిగి, రూ. 4,82,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 4,820గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Discounts on Hyundai cars: ఎక్స్టర్ ఎస్యూవీ సహా టాప్ మోడళ్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన హ్యుందాయ్

2024 Maruti Suzuki Swift: 2024 మారుతి సుజుకీ స్విఫ్ట్ రేపు లాంచ్: టాప్ మైలేజ్ ఇచ్చే హ్యాచ్ బ్యాక్ ఇదే..

EPFO alert: ఉద్యోగులకు షాక్; గ్రాట్యుటీ పరిమితి పెంపు అమలుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

Aadhar Housing IPO: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ప్రారంభం; అప్లై చేయొచ్చా?.. నిపుణులేమంటున్నారు?

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 430 వృద్ధి చెంది.. రూ. 52,580కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 52,150గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 4300 పెరిగి.. రూ. 5,25,800గా ఉంది.

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,350గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,750గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,200 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 52,580గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,920గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,370గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 48,230గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 52,610గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,200గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,580గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,250గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 52,630గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 48,200గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,580గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 6,170గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 200 దిగొచ్చి.. 61,700కి చేరింది. శనివారం ఈ ధర రూ. 61,900గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 67,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 67,500.. బెంగళూరులో రూ. 67,500గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం దిగొచ్చాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 280 తగ్గి.. రూ 26,500కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,780గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,500గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)