తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Aadhar Housing Ipo: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ప్రారంభం; అప్లై చేయొచ్చా?.. నిపుణులేమంటున్నారు?

Aadhar Housing IPO: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ప్రారంభం; అప్లై చేయొచ్చా?.. నిపుణులేమంటున్నారు?

HT Telugu Desk HT Telugu

08 May 2024, 15:17 IST

    • ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ మే 8న ప్రారంభమైంది. మే 10వ తేదీ వరకు బిడ్డింగ్ చేసుకోవచ్చు. ఈ ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్లకు 35% షేర్లు రిజర్వ్ చేశారు. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను రూ.300 నుంచి రూ.315 మధ్య నిర్ణయించారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.898 కోట్లు సమీకరించింది.
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ (https://aadharhousing.com/)

ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ

Aadhar Housing IPO: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ మే 8, బుధవారం ప్రారంభమై మే 10 శుక్రవారంతో ముగుస్తుంది. బ్లాక్ స్టోన్ సపోర్ట్ ఉన్న ఈ సంస్థ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.300 నుంచి రూ.315గా నిర్ణయించారు. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.898 కోట్లు సమీకరించింది. ఇన్వెస్టర్లు కనీసం 47 షేర్లతో బిడ్స్ దాఖలు చేయవచ్చు.

రిటైల్ ఇన్వెస్టర్లకు 35% రిజర్వ్

ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ఇష్యూ సైజులో రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NII) 15 శాతం, క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ కు (QIB) ఇష్యూ సైజులో 50 శాతం కేటాయించింది. కంపెనీ తన ఉద్యోగులకు ఒక్కో షేరుకు రూ.23 డిస్కౌంట్ అందిస్తోంది. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది తక్కువ ఆదాయ వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ 2010 లో స్థాపించబడిన హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ. భారతదేశంలోని టైర్ 4, టైర్ 5 పట్టణాల్లోని కస్టమర్లు ఈ సంస్థ టార్గెట్ మార్కెట్.

ఆధార్ మిత్ర..

సెప్టెంబర్ 30, 2023 నాటికి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ 12,221 మంది ఆధార్ మిత్రలను చేర్చింది. రుణాలు పొందడంలో తమ ఖాతాదారులకు సహకరించినందుకు గానూ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ వారికి రిఫరల్ ఫీజు చెల్లిస్తుంది. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లో కొత్త నివాస, వ్యాపార భవనాల నిర్మాణం, రెనోవేషన్ తదితర అవసరాల కోసం రుణాలు తీసుకోవచ్చు. సెప్టెంబర్ 30, 2023 నాటికి ఈ సంస్థకు 91 సేల్స్ ఆఫీసులతో సహా 471 శాఖల విస్తృత నెట్వర్క్ ఉంది. ఈ శాఖలు, సేల్స్ కార్యాలయాలు భారతదేశంలో సుమారు 10,926 పిన్ కోడ్ లలో సేవలను అందిస్తాయి. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉంది. మార్చి 31, 2022 నుంచి మార్చి 31, 2023 మధ్య ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పన్ను అనంతర లాభం (PAT) 22.22 శాతం పెరగ్గా, ఆదాయం 18.22 శాతం పెరిగింది.

ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ వివరాలు

ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.3,000 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ లో.. రూ. 2000 కోట్లు ఆఫర్ ఫర్ సేల్, రూ. 1000 కోట్లు తాజా ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రధాన ప్రమోటర్ అయిన బ్లాక్ స్టోన్ గ్రూప్ అనుబంధ సంస్థ టాప్కో VII ప్రైవేట్ లిమిటెడ్ ఆఫర్ ఫర్ సేల్ ను అందిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ కార్యకలాపాలకు, తదుపరి రుణాల కోసం భవిష్యత్ మూలధన అవసరాలను తీర్చడానికి ఉపయోగించాలని ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ యోచిస్తోంది.

ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ జీఎంపీ నేడు

ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ జీఎంపీ మొదటి రోజైన మే 8న +70గా ఉంది. గ్రే మార్కెట్లో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు ధర రూ.70 ప్రీమియం వద్ద ట్రేడవుతోందని investorgain.com వెల్లడించింది. అంటే లిస్టింగ్ రోజు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ షేర్లు కనీసం 22% ప్రీమియంతో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది.

సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకింగ్ కంపెనీలవి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగువి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

తదుపరి వ్యాసం