తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Rates Today: బంగారం ధర మళ్లీ పైకి.. తులం ఎంత ఉందంటే!

Gold Rates Today: బంగారం ధర మళ్లీ పైకి.. తులం ఎంత ఉందంటే!

10 November 2022, 6:23 IST

    • Gold, Silver Rates today: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి, ప్లాటినం కూడా నేడు ఇదే బాటపట్టాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి, ప్లాటినం ధరలు ఎలా ఉన్నాయో చూడండి.
Gold price today: నేటి బంగారం ధరలు
Gold price today: నేటి బంగారం ధరలు (REUTERS)

Gold price today: నేటి బంగారం ధరలు

Gold, Silver Prices Today: రెండు రోజుల స్వల్ప తగ్గుదల తర్వాత.. దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. భారత్‍లో నేడు (నవంబర్ 10) పసిడి ధర పైకి ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్‍లో స్పాట్ బంగారం ఔన్స్ ధర నేడు కాస్త తగ్గినా.. ఇండియాలో మాత్రం పెరిగింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) బంగారం రేటు నేడు రూ.560 పెరిగి.. రూ.47,360కు చేరింది. 24 క్యారెట్ల పడిసి ధర (10 గ్రాములు) కూడా రూ.620 అధికమైంది. 10 గ్రాముల రేటు రూ.51,670కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో నేటు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

Today Gold Rate in Hyderabad: హైదరాబాద్ మార్కెట్‍లోనూ నేడు పసిడి ధర పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేట్ రూ.47,360కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది. విజయవాడలోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. పసిడి రేట్ పైకి వెళ్లింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ హైదరాబాద్ ధరలే ఉన్నాయి.

Gold price today in Delhi: దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర పైకి వెళ్లింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,460కు చేరింది. 24 క్యారెట్ల విషయానికి వస్తే రేట్ రూ.51,770కు వెళ్లింది. చెన్నైలో 22 క్యారెట్ల (10 తులాలు) పసిడి ధర రూ.48,150, 24 క్యారెట్ల రేట్ రూ.52,530గా ఉంది.

కోల్‍కతా మార్కెట్‍లోనూ నేడు బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర అక్కడ రూ.47,360కు చేరింది. 24 క్యారెట్ల తులం రేట్ రూ.51,670గా ఉంది. ముంబైలోనూ ఇవే ధరలు ఉన్నాయి. అహ్మదాబాద్‍లో 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.47,410, 24 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.51,720కు ఎగబాకింది.

Silver Price Today: వెండి కూడా ప్రియం

వెండి కూడా నేడు బంగారాన్ని ఫాలో అయింది. దేశంలో వెండి ధరలు కూడా కాస్త పెరిగాయి. 100 గ్రాముల వెండి ధర రూ.85 పెరిగి రూ.6,170కు చేరింది.

Silver price today in Hyderabad : ధరలో కాస్త పెరుగుదలతో హైదరాబాద్ మార్కెట్‍లో కిలో వెండి ధర రూ.67,400కు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధర ఉంది. ఢిల్లీ, ముంబైలో రూ.61,700, బెెంగళూరులో రూ.67,400కు చేరింది.

Today Platinum Price: ప్లాటినం ధర సైతం..

దేశంలో ప్లాటినం ధర కూడా హెచ్చుదల నమోదు చేసింది. 10 గ్రాముల ప్లాటినం రూ.510 మేర పెరిగింది. రూ.26,210కు చేరింది. నేడు బంగారం, వెండినే ప్లాటినం కూడా అనుసరించింది.

హైదరాబాద్‍లో నేడు 10 గ్రాముల ప్లాటినం ధర రూ.26,21గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‍కతా, అహ్మదాబాద్, లక్నోతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఇదే ధర ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‍లో నేడు బంగారం ధర చాలా స్వల్వంగా తగ్గింది. ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం 1,705.88 డాలర్ల వద్ద ఉంది. 5.66 డాలర్లు తగ్గింది. అయితే నేడు ఇండియాలో మాత్రం పసిడి ధర పెరిగింది.

తదుపరి వ్యాసం