తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rates Today : స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. హైదరాబాద్​లో ఎంతంటే

Gold and Silver rates today : స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. హైదరాబాద్​లో ఎంతంటే

24 January 2023, 6:15 IST

    • Gold and Silver rates today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (PTI)

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Gold and Silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 పెరిగి.. రూ. 52,350కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 52,250గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 పెరిగి, రూ. 5,23,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,235గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 50 వృద్ధి చెంది.. రూ. 57,110కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 57,060గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 500 పెరిగి.. రూ. 5,71,100గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా..

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,500గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,270గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,350 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 57,110గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 53,230గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,070గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 52,350గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 57,110గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,350గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,110గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,400గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 57,160గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,350గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,110గా ఉంది.

ద్రవ్యోల్బణం,ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,230గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 72,300గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధరల పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 74,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 72,300.. బెంగళూరులో రూ. 74,700గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 60 పెరిగి.. రూ. 27,190కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 27,130గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,190గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)