తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 22 January Latest Prices In Hyderabad And Vijayawada

Gold and silver rates today : దిగొచ్చిన పసిడి, పెరిగిన వెండి ధరలు- నేటి లెక్కలివే

22 January 2023, 6:19 IST

    • Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు పెరిగాయి.  ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (PTI)

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు ఆదివారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 తగ్గి.. రూ. 52,250కి చేరింది. శనివారం ఈ ధర రూ. 52,350గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1,000 తగ్గి రూ. 5,22,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,225గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

First Bajaj CNG motorcycle: బజాజ్ నుంచి తొలి సీఎన్జీ మోటార్ సైకిల్; జూన్ 18 న లాంచ్

Bajaj Pulsar NS400Z: 2024 పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను లాంచ్ చేసిన బజాజ్; ధర కూడా తక్కువే..

‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 50 తగ్గి.. రూ. 57,060కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 57,110గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 500 తగ్గి.. రూ. 5,70,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,706గా ఉంది.

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,400గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,210గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,250 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 57,060గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 53,200గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,040గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 52,250గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 57,060గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,250గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,060గాను నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,300గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 57,110గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,250గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,060గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,230గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 200 పెరిగి.. రూ. 72,300గా కొనసాగుతోంది. శనివారం ఈ ధర రూ. 72,100గా ఉండేది..

Silver rates today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 74,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 72,300.. బెంగళూరులో రూ. 74,300గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 250 పెరిగి.. రూ 27,130కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,880గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,130గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)