తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 21st January 2022 Check Latest Prices In Telugu States

Gold and silver rates today : పెరిగిన పసిడి ధరలు.. వెండి కూడా- ఎంతంటే..

21 January 2023, 6:16 IST

    • Gold and silver rates today : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శనివారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 350 పెరిగి.. రూ. 52,350కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 52,000గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 3,500 పెరిగి, రూ. 5,23,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,235గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Changes from May 1 : మే 1 నుంచి ఈ విషయాల్లో భారీ మార్పులు.. కచ్చితంగా తెలుసుకోవాలి

Best Mutual Funds : ఏడాది కాలంలో అద్భుత రిటర్నులు ఇచ్చిన టాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇవే..

Mahindra XUV 3XO : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వేరియంట్లు- వాటి ధరలు..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 155 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ ప్రాఫిట్స్​!

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 380 వృద్ధి చెంది.. రూ. 57,110కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 56,730గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 3,800 పెరిగి.. రూ. 5,71,100గా ఉంది.

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,500గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,270గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,350 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 57,110గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 53,250గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,090గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 52,350గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 57,110గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,350గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,110గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,400గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 57,160గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,30గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,110గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,210గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 200 పెరిగి 72,100కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 71,900గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 74,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 72,100.. బెంగళూరులో రూ. 72,100గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 310 తగ్గి.. రూ 26,880కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,190గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,880గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)