Budget 2023 : బడ్జెట్‌పై ‘ఆశలు- అంచనాలు’.. నిర్మలమ్మపైనే భారం!
30 January 2023, 10:50 IST
- Sector wise expectations on Budget 2023 : ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో.. వివిధ రంగాల్లో బడ్జెట్‌పై ఉన్న ఆశలు, అంచనాలను తెలుసుకుందాము..
నిర్మలా సీతారామన్
Sector wise expectations on Budget 2023 : బడ్జెట్ 2023కి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ ప్రసంగం కోసం దేశం ఎదురుచూస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండటం.. బడ్జెట్‌పై ప్రభావం ఉంటుందని ఆర్థిక వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో దేశంలో ఏ ఏ రంగాల్లో.. బడ్జెట్‌పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలుసుకుందాము..
ఆటో పరిశ్రమ..
- రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఆటో పరిశ్రమకు ప్రోత్సాహకాలు. పన్ను రాయితీ.
- Auto sector expectations on Budget 2023 : ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరిచేందుకు ప్రోత్సాహకాలు
- ఆటో పరికరాలపై జీఎస్టీ తగ్గింపు. ఏకరీతిలో పన్ను విధానాల అమలు
రోడ్డు.. రైల్వే.. ఎయిర్‌పోర్ట్‌లు..
- రోడ్డు, రైల్వే బడ్జెట్ నిధుల్లో 15శాతం పెరుగుదల
- Railway Budget 2023 : కార్గో రవాణాలో రైల్వే వాటా పెరిగే విధంగా చర్యలు
- వేర్‌హౌజింగ్ కెపాసిటీ వృద్ధి. మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్స్ ఏర్పాటుపై దృష్టి పెట్టడం
- పీఎం గతిశక్తిలో భాగంగా పోర్టు కనెక్టివిటీని పెంచడం
ఫార్మా.. ఆరోగ్యం..
- రీ-ఇన్వెస్ట్‌మెంట్‌పై మద్దతు నేపథ్యంలో.. 10ఏళ్ల పాటు ట్యాక్స్ రిలీఫ్
- Pharma sector Budget 2023 : ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో యూనిఫార్మ్ అడాప్షన్
- ఆర్ అండ్ డీపై పెడుతున్న ఖర్చులో ట్యాక్స్ ఇన్సెన్టివ్స్
చమురు.. గ్యాస్..
- గతేడాది విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్ ఎత్తివేత
- పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాలపై స్వల్ప తగ్గింపు
- సీఎన్జీకి సంబంధించి ఎలాంటి ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఉండదు
- ఎల్పీజీ సబ్సిడీ చాలా తక్కువగానే ఉంటుంది
మెటల్స్.. మైనింగ్..
- హై- గ్రేడ్ స్పెషాలిటీ స్టీల్ తయారీకి పీఎల్ఏ స్కీమ్ వర్తింపు
- స్టీల్ డంపింగ్‌పై చర్యలు
హాస్పిటాలిటీ..
- ఈజీఎల్జీఎస్ లోన్ టర్మ పెంపు. బ్రౌన్‌ఫీల్డ్ హాస్పిటాలిటీ ప్రాజెక్టులకు సెక్షన్ 35డీ వర్తింపు
- Hospitality sector in India : తక్కువ వడ్డీ రేటు, పన్నుల హేతుబద్ధీకరణతో లోన్ మోరటోరియం కాలవ్యవధి పెంపు
- రానున్న 3-5ఏళ్లకు సంబంధించి నెట్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఆదాయంపై 3-10శాతం వడ్డీ రేటు పెంపు
ఎఫ్ఎంసీజీ.. టెలికాం..
- గ్రామీణ డిమాండ్ పెంపునకు కృషి చేయడం
- Tobacco tax increase : పొగాకు, పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంపు
- బంగారంపై కస్టమ్ డ్యూటీ పెంపు.
- తక్కువ ఎఫెక్టివ్ రేటుతో ఏటీఎఫ్‌ని జీఎస్టీ పరిధిలోకి చేర్చడం (టెలికాం)
కన్జ్యూమర్ డ్యూరెబుల్..
- ఈఎంఎస్ కంపెనీలకు లబ్ధిచేకూర్చే విధంగా.. పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ పెంపు
- ఐటీ హార్డ్‌వేర్ వంటి రంగాలకు పీఎల్ఐ విస్తరణ
- బొమ్మల తయారీకి పీఎల్ఐ స్కీమ్ ప్రవేశపెట్టడం
- ఫ్యన్స్, లైటింగ్‌పై జీఎస్టీ తగ్గింపు
కెమికల్స్..
క్రాప్ ప్రొటెక్షన్- ఏపీఎంసీ, అగ్రీ ఇన్ఫ్రాపై పెట్టుబడులు
పెస్టిసైడ్స్పై ప్రస్తుతం ఉన్న 18శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గింపు
టెక్నికల్ పరికరాలపై ఉన్న దిగుమతి సుంకాలు 10శాతం నుంచి 20శాతానికి పెంపు
ఫర్టిలైజర్స్- ఎరువులపై సబ్సిడీలో బడ్జెట్ కోత, తగ్గింపు
ఇండియన్ గ్యాస్ ఎక్స్ఛేంజ్ ద్వారా ఎరువుల కంపెనీలు ఎల్ఎన్జీ కొనుగోలుకు చర్యలు
మౌలికవసతులు..
Budget 2023 schedule : ఎన్నికల నేపథ్యంలో ఈ దఫా బడ్జెట్లో కేంద్రం మౌలికవసతులపై అధిక దృష్టిపెడుతుందని అంచనాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులకు ఆమోదం, పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు నిధుల పెంపు వంటివి కీలకంగా వినిపిస్తున్నాయి.
మంగళవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ జరగనున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.