Budget stocks to buy 2023 : బడ్జెట్ టైమ్‌లో ఫోకస్ చేయాల్సిన 5 స్టాక్స్ లిస్ట్
Budget stocks to buy 2023 : బడ్జెట్ 2023 త్వరలోనే బయటకు రానుంది. దలాల్ స్ట్రీట్‌లో ఇప్పటికే హడావుడి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ బడ్జెట్ టైమ్‌లో ఫోకస్ చేయాల్సిన కొన్ని స్టాక్స్‌ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to focus on Budget 2023 : దలాల్ స్ట్రీట్‌లో 'బడ్జెట్ 2023' హడావుడి స్పష్టంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్‌తో లబ్ధిపొందే అవకాశాలు ఉన్న సెక్టార్లలో జోరుగా ట్రేడింగ్ జరుగుతోంది. దీర్ఘకాలిక ప్రణాళికలతో మదుపర్లు ఆయా సెక్టార్‌కు సంబంధించిన స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే.. ఈ దఫా బడ్జెట్లో మౌలికవసతులకు పెద్దపీట వేసే అవకాశం ఉంటుందని, ఫలితంగా ఈ రంగంలోని స్టాక్స్‌పై ఫోకస్ చేయాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌కు చెందిన 5 స్టాక్స్‌ను బై చేయాలని చెబుతున్నారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌పై ఎందుకు ఫోకస్ చేయాలి?
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. పైగా.. ఈ ఏడాదిలో దాదాపు 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అభివృద్ధి సాధించాలంటే, మౌలికవసతులను పెంచాలని, అందుకే ఆ రంగంపై బడ్జెట్ 2023లో ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తుందని దలాల్ స్ట్రీట్‌లో అంచనాలు ఉన్నాయి.
Budget stocks to buy 2023 : నిపుణుల ప్రకారం.. అంచనాలు నిజమైతే.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోని కంపెనీల ఆర్డర్ బుక్‌లు, మార్జిన్లు మరో 3-4 క్వార్టర్ల వరకు పెరుగుతాయి. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ వస్తుంది.
"వ్యవసాయం తర్వాత.. దేశంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టించే రంగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మంచి గుర్తింపు ఉంది. ఈ దఫా బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ప్రత్యేక దృష్టి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఫలితంగా.. మరో ఒకటిన్నరేళ్ల వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఫోకస్లో ఉండనుంది. ఇదే జరిగితే.. ఆయా రంగాల్లోని కంపెనీల లాభాలు పొరగొచ్చు. అందుకే.. బడ్జెట్‌కు ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కొనుగోలు చేసుకోవడం బెటర్. 9-12 నెలలు లేదా ఇంకా దీర్ఘకాలం వాటిని హోల్డ్ చేయొచ్చు," అని ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్ష్కర్ తెలిపారు.
బడ్జెట్ స్టాక్స్ టు ఫోకస్..
Stocks to buy before budget 2023 : ఎన్సీసీ, కమిన్స్ ఇండియా, సీమెన్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఎల్ అండ్ టీ షేర్లను కొనుగోలు చేయాలని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఒస్వాల్కు చెందిన స్టాక్ మార్కెట్ నిపుణులు చందన్ తపారియా తెలిపారు. బడ్జెట్‌కు ముందు వాటిని కొనుగోలు చేసి.. బడ్జెట్ ప్రసంగం తర్వాత రివ్యూ చేయాలని సూచించారు. అంచనాలకు తగ్గట్టు బడ్జెట్ ఉంటే.. ఆ స్టాక్స్‌కు దీర్ఘకాలం వరకు హోల్డ్ చేయవచ్చని స్పష్టం చేశారు. అలా జరగకపోతే.. షార్ట్ టర్మ్‌లో ప్రాఫిట్లను బుక్ చేసుకోవాలని వివరించారు.
ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం