Budget 2023: డేట్, టైమ్, లైవ్ వివరాలు.. కేంద్ర బడ్జెట్‍ను మీ ఫోన్‍లో డౌన్‍లోడ్ చేసుకోవచ్చు!
Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ (Union Budget FY 2023-24) ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్‍ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman).
Budget 2023: ఎంతో కీలకమైన 2023 కేంద్ర బడ్జెట్‍కు సమయం ఆసన్నమవుతోంది. వచ్చే ఏడాది లోక్‍సభ ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చివరి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ ఇది. దీంతో దేశమంతా ఈ బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman).. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‍ను ప్రవేశపెట్టనున్నారు. దీంట్లో పూర్తి ఆర్థిక పాలసీలు ఉంటాయి. జనవరి 31వ తేదీన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. అదే రోజు ఎకనమిక్ సర్వే (Economic Survey) సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాతి రోజు బడ్జెట్ ఉంటుంది. 2023-24 కేంద్ర బడ్జెట్ ఏ టైమ్‍కు మొదలవుతుంది, లైవ్ ఎక్కడ చూడవచ్చు, ఫోన్‍లో బడ్జెట్ పేపర్లను ఎలా డౌన్‍లోడ్ చేసుకోవచ్చంటే..
(బడ్జెట్ లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Union Budget 2023: టైమ్
Budget 2023 Timings: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగం పార్లమెంటులో ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‍ను ప్రవేశపెడతారు. సుమారు రెండు గంటల పాటు ఇది ఉండనుంది.
Union Budget 2023: ఎక్కడ చూడవచ్చు..
పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రసంగాన్ని ప్రభుత్వ ఛానెల్ సన్‍సద్ (Sansad TV)లో పూర్తిగా చూడవచ్చు. ప్రైవేట్ బ్రాడ్‍కాస్టింగ్ టీవీ చానెల్స్ కూడా ప్రత్యక్ష ప్రసారాలను ఇస్తాయి. అనేక డిజిటల్ న్యూస్ ప్లాట్‍ఫామ్‍లో కూడా లైవ్ ఉంటుంది.
(బడ్జెట్ లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Union Budget 2023: డౌన్‍లోడ్ ఎలా..?
Budget Download: స్మార్ట్ ఫోన్‍లో కేంద్ర బడ్జెట్ పూర్తి ప్రతులను డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్‍లో ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’ (Union Budget Mobile App) ద్వారా బడ్జెట్ పేపర్లను ప్రజలు డౌన్‍లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లో, ఐఓఎస్ మొబైళ్లు వాడుతున్న వారు యాపిల్ స్టోర్ ద్వారా ఈ యాప్‍ను ఇన్‍స్టాల్ చేసుకోవచ్చు.
Union Budget 2023: ఎప్పటి నుంచి?
పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక Union Budget Mobile Appలో బడ్జెట్ ప్రతులు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు డౌన్‍లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీలో ఈ బడ్జెట్ ఉంటుంది.
Union Budget 2023 Expectations: పన్ను చెల్లింపుదారులు, మధ్యతరగతి ప్రజలు, కార్పొరేట్లతో పాటు దేశంలోని అన్ని రంగాలు, వర్గాలకు చెందిన వారు 2023-24 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నారు. పన్ను స్లాబుల్లో మార్పులు, పన్ను మినహాయింపులు, సడలింపులు, సబ్సిడీలు, ఇన్సెంటివ్‍ల కోసం చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం కూడా బడ్జెట్‍లో ప్రధాన అంశం కానుంది.
సంబంధిత కథనం