తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Budget 2023 For Salaried Class: బడ్జెట్ నుంచి వేతన జీవుల ఆశిస్తున్నది ఇవే

Budget 2023 for Salaried class: బడ్జెట్ నుంచి వేతన జీవుల ఆశిస్తున్నది ఇవే

HT Telugu Desk HT Telugu

19 January 2023, 16:32 IST

  • Salaried class is seeking tax relief from Budget 2023: పెరిగిన ద్రవ్యోల్భణం, జీవన వ్యయం కారణంగా బడ్జెట్‌లో అనేక పన్ను మినహాయింపులను వేతన జీవులు ఆశిస్తున్నారు.

బడ్జెట్ 2023 నుంచి పన్ను మినహాయింపులు ఆశిస్తున్న వేతన జీవులు
బడ్జెట్ 2023 నుంచి పన్ను మినహాయింపులు ఆశిస్తున్న వేతన జీవులు (HT_PRINT)

బడ్జెట్ 2023 నుంచి పన్ను మినహాయింపులు ఆశిస్తున్న వేతన జీవులు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2023ని సమర్పించనున్నారు. బడ్జెట్ నుండి ఉపశమనం కోసం ఎదురుచూస్తున్న పన్ను చెల్లింపుదారులలో వేతన జీవులు కూడా ఉన్నారు.

ఆదాయపు పన్ను శాఖ లెక్కల ప్రకారం 2022లో దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లలో (ITR) దాదాపు 50 శాతం వేతన జీవులవే. ఈ పన్ను చెల్లింపుదారులు బడ్జెట్-2023 తమకు ఆరోగ్య సంరక్షణ, పదవీ విరమణ తర్వాత దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించాలని, అలాగే సరసమైన ధరల్లో గృహాలను అందించాలని ఆశిస్తున్నారు.

బడ్జెట్ 2023 నుంచి వేతన జీవులు ఆశిస్తున్న ఉపశమనాలు ఇవే

Tax slabs: పన్ను శ్లాబులు

ప్రస్తుత టాక్స్ శ్లాబుల ప్రకారం ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షలుగా ఉంది. దీనిని రూ. 5 లక్షలకు పెంచాలని చాలా కాలం నుంచి వేతన జీవులు ఆశిస్తున్నారు. ద్రవ్యోల్భణం, జీవన వ్యయం పెరుగుదల కారణంగా ఈ మినహాయింపును ఆశిస్తున్నారు. ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షలను 2014-15 నుంచి ఇప్పటి వరకు మార్చలేదు.

Tax exemption limit for home buyers: ఇంటి కొనుగోలు దారులకు ఊరట

హోమ్ లోన్ తీసుకునే వారు రూ. 2 లక్షల వరకు వడ్డీ చెల్లింపును మినహాయింపుగా చూపవచ్చు. సెక్షన్ 24బీ కింద దీనిని మినహాయింపు కోరవచ్చు. అలాగే సెక్షన్ 80 సీ కింద హోం లోన్ అసలును రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు చూపవచ్చు. అయితే సెక్షన్ 80 సీ కింది ట్యూషన్ ఫీజులు, పీఎఫ్, జీవిత బీమా ప్రీమియంలు మినహాయింపు కోరవచ్చు. అందువల్ల ఈ సెక్షన్ పరిధిలో వాస్తవికంగా చూస్తే హోం లోన్ మినహాయింపులు కోరడానికి ఆస్కారం ఉండదు. అందువల్ల సెక్షన్ 24 బీ కింద కనీసం రూ. 5లక్షలు, 80 సీ పరిమితిని రూ. 3 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.

Exemption on Personal Loans: పర్సనల్ లోన్స్‌కూ మినహాయింపు

ప్రస్తుతం కేవలం సెక్షన్ 80ఈ కింద ఎడ్యుకేషన్ లోన్లపై చెల్లించే వడ్డీని మాత్రమే ఆదాయ పన్ను నుంచి మినహాయింపు కోరవచ్చు. దీనిని పర్సల్ లోన్లకూ వర్తింపజేయాలని వేతన జీవులు కోరుతున్నారు.

Higher Standard Deduction: స్టాండర్డ్ డిడక్షన్ పెంపు

ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలుగా ఉంది. దీనిని 2022-23 బడ్జెట్‌లో కనీసం రూ. 1 లక్షలకు పెంచాలని వేతన జీవులు కోరుతున్నారు.

Enhance 80C And 80D Limit: లిమిట్స్ పెంచాలి

ప్రభుత్వ పొదుపు పథకాలైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) తదితర పథకాల్లో పొదుపు చేసుకునేలా ప్రోత్సహించేందుకు సెక్షన్ 80 సీ, సెక్షన్ 80డీ పరిమితులను పెంచాలని వేతన జీవులు కోరుతున్నారు. 80సీని రూ. 3 లక్షలకు, 80డీని రూ. 1 లక్షకు పెంచాలని కోరుతున్నారు. ఆరోగ్య సేవలు ఖరీదైన నేపథ్యంలో ఈ మినహాయింపు కావాలని ఆశిస్తున్నారు.

Enhance Other Deductions: ఇతర మినహాయింపుల పరిమితి పెంచాలి

80ఈఈఏ (హోం లోన్‌పై వడ్డీ), 80ఈఈబీ (ఎలక్ట్రిక్ వెహికిల్ లోన్)లపై మినహాయింపును మరో రెండేళ్లపాటు పొడిగించాలని కోరుతున్నారు. సెక్షన్ 80టీటీఏ కింద పరిమితిని కనీసం రూ. 30 వేలకు పెంచాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు.

ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియానికి, హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియానికి, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియానికి చెల్లించే మొత్తంపై ప్రస్తుతం 80 సీ కింద మినహాయింపు లేదు. వీటిని కూడా టాక్స్ డిడక్షన్స్‌ కింద అనుమతించాలని, ప్రజలు ఈ రక్షణలను కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలని వేతన జీవులు కోరుతున్నారు.

Children's Education, Hostel Allowance: పిల్లల విద్య, హాస్టల్ అలొవెన్స్

చైల్డ్ ఎడ్యుకేషన్, హాస్టల్ అలొవెన్స్ విషయంలో 20 ఏళ్లుగా మార్పు లేదు. ఒక్కో చిన్నారికి రూ. 100, రూ. 300గా ఉంది. వీటిని రూ. 1000కి, రూ. 3 వేలకు పెంచాలని వేతన జీవులు కోరుతున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం