windfall tax news : ముడి చమురుపై విండ్​ఫాల్​ ట్యాక్స్​ని తగ్గించిన కేంద్రం-centre reduces windfall tax on oil to rs 10 500 a tonne ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Windfall Tax News : ముడి చమురుపై విండ్​ఫాల్​ ట్యాక్స్​ని తగ్గించిన కేంద్రం

windfall tax news : ముడి చమురుపై విండ్​ఫాల్​ ట్యాక్స్​ని తగ్గించిన కేంద్రం

Sharath Chitturi HT Telugu
Sep 17, 2022 07:52 AM IST

Centre reduces windfall tax on oil : ముడి చమురుపై విండ్​ఫాల్​ ట్యాక్స్​ని తగ్గించింది కేంద్రం. 15రోజులుగా అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తుండటమే ఇందుకు కారణం.

ముడిచమురుపై విండ్​ఫాల్​ ట్యాక్స్​ని తగ్గించిన కేంద్రం
ముడిచమురుపై విండ్​ఫాల్​ ట్యాక్స్​ని తగ్గించిన కేంద్రం (REUTERS)

Centre reduces windfall tax on oil : ముడి చమురుపై విండ్​ఫాల్​ ట్యాక్స్​ని 21శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా టన్ను ముడి చమురుపై విండ్​ఫాల్​ ట్యాక్స్​ రూ. 10,500కి చేరింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గత కొన్ని రోజులుగా దిగొస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

గత రెండు వారాల్లో.. ఇండియాలో ఉత్పత్తి చేసిన ముడి చమురు అమ్మకాలపై.. టన్నుకు రూ. 13,300 అదనపు పన్నును విధించింది కేంద్రం.

ఏటీఎఫ్​పై స్పెషల్​ అడిషనల్​ ఎక్సైజ్​ డ్యూటీని లీటరుకు రూ. 9 నుంచి రూ. 5కు తగ్గించింది కేంద్రం. సెస్​లో ఎలాంటి మార్పులు చేయలేదు.

మరోవైపు డీజిల్​ ఎగుమతులపై ఉన్న ప్రత్యేక అదనపు సుంకాల్ని సైతం.. లీటరుకు రూ. 12 నుంచి రూ. 8.5కి తగ్గించింది. ఈ మార్పులు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి.

విండ్​ఫాల్​ ట్యాక్స్​..

India Windfall tax : చైనాలో కొవిడ్​ లాక్​డౌన్​ కారణంగా చమురు డిమాండ్​ తగ్గింది. ఫలితంగా చమురు ధరలు గత కొన్ని రోజులుగా దిగొస్తున్నాయి. ప్రస్తుతం.. బ్రెంట్​ క్రూడ్​ నవంబర్​ ఫ్యూచర్స్​ కాంట్రాక్ట్​.. బ్యారెల్​కు 91.62డాలర్లుగా ఉంది. ఆగస్టు 31న ఇది 105డాలర్లుగా ఉంది. అంటే రెండు వారాల్లో 13శాతం పడిపోయినట్టు.

మరోవైపు ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు కూడా చమురు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

అయితే.. రష్యా ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా చమురు ధరలు, డిమాండ్​లో తీవ్ర ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి.

Windfall tax news : జులై 1న.. ఏటీఎఫ్​(లీటరుకు రూ. 13), పెట్రోల్​(లీటరుకు రూ. 6) ఎగుమతులపై సుంకాన్ని విధించింది కేంద్రం. దేశీయంగా ఉత్పత్తి చేసిన చమురు అమ్మకాలపై టన్నుకు రూ. 23,250 మేర విండ్​ఫాల్​ ట్యాక్స్​ని విధించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం