తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget Stocks To Buy 2023 : బడ్జెట్​ టైమ్​లో ఫోకస్​ చేయాల్సిన 5 స్టాక్స్​ లిస్ట్

Budget stocks to buy 2023 : బడ్జెట్​ టైమ్​లో ఫోకస్​ చేయాల్సిన 5 స్టాక్స్​ లిస్ట్

24 January 2023, 11:15 IST

google News
    • Budget stocks to buy 2023 : బడ్జెట్​ 2023 త్వరలోనే బయటకు రానుంది. దలాల్​ స్ట్రీట్​లో ఇప్పటికే హడావుడి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ బడ్జెట్​ టైమ్​లో ఫోకస్​ చేయాల్సిన కొన్ని స్టాక్స్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
బడ్జెట్​ టైమ్​లో ఫోకస్​ చేయాల్సిన 5 స్టాక్స్​ లిస్ట్​..
బడ్జెట్​ టైమ్​లో ఫోకస్​ చేయాల్సిన 5 స్టాక్స్​ లిస్ట్​..

బడ్జెట్​ టైమ్​లో ఫోకస్​ చేయాల్సిన 5 స్టాక్స్​ లిస్ట్​..

Stocks to focus on Budget 2023 : దలాల్​ స్ట్రీట్​లో 'బడ్జెట్​ 2023' హడావుడి స్పష్టంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్​తో లబ్ధిపొందే అవకాశాలు ఉన్న సెక్టార్​లలో జోరుగా ట్రేడింగ్​ జరుగుతోంది. దీర్ఘకాలిక ప్రణాళికలతో మదుపర్లు ఆయా సెక్టార్​కు సంబంధించిన స్టాక్స్​లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే.. ఈ దఫా బడ్జెట్​లో మౌలికవసతులకు పెద్దపీట వేసే అవకాశం ఉంటుందని, ఫలితంగా ఈ రంగంలోని స్టాక్స్​పై ఫోకస్​ చేయాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సెక్టార్​కు చెందిన 5 స్టాక్స్​ను బై చేయాలని చెబుతున్నారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము.

ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సెక్టార్​పై ఎందుకు ఫోకస్​ చేయాలి?

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్​ ఇదే. పైగా.. ఈ ఏడాదిలో దాదాపు 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అభివృద్ధి సాధించాలంటే, మౌలికవసతులను పెంచాలని, అందుకే ఆ రంగంపై బడ్జెట్​ 2023లో ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్​ చేస్తుందని దలాల్​ స్ట్రీట్​లో అంచనాలు ఉన్నాయి.

Budget stocks to buy 2023 : నిపుణుల ప్రకారం.. అంచనాలు నిజమైతే.. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ రంగంలోని కంపెనీల ఆర్డర్​ బుక్​లు, మార్జిన్లు మరో 3-4 క్వార్టర్ల వరకు పెరుగుతాయి. బడ్జెట్​ను ప్రవేశపెట్టిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ వస్తుంది.

"వ్యవసాయం తర్వాత.. దేశంలో అత్యధిక ఉద్యోగాల​ను సృష్టించే రంగంగా ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కు మంచి గుర్తింపు ఉంది. ఈ దఫా బడ్జెట్​లో ఇన్​ఫ్రాస్ట్రక్చర్​పై ప్రత్యేక దృష్టి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఫలితంగా.. మరో ఒకటిన్నరేళ్ల వరకు ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ రంగం ఫోకస్​లో ఉండనుంది. ఇదే జరిగితే.. ఆయా రంగాల్లోని కంపెనీల లాభాలు పొరగొచ్చు. అందుకే.. బడ్జెట్​కు ముందు ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ స్టాక్స్​ కొనుగోలు చేసుకోవడం బెటర్​. 9-12 నెలలు లేదా ఇంకా దీర్ఘకాలం వాటిని హోల్డ్​ చేయొచ్చు," అని ప్రాఫిట్​మార్ట్​ సెక్యూరిటీస్​ రీసెర్చ్​ హెడ్​ అవినాష్​ గోరక్ష్​కర్ తెలిపారు.

బడ్జెట్​ స్టాక్స్​ టు ఫోకస్​..

Stocks to buy before budget 2023 : ఎన్​సీసీ, కమిన్స్​ ఇండియా, సీమెన్స్​, కేఎన్​ఆర్​ కన్​స్ట్రక్షన్స్​, ఎల్​ అండ్​​ టీ​ షేర్లను కొనుగోలు చేయాలని ప్రముఖ బ్రోకరేజ్​ సంస్థ మోతీలాల్​ ఒస్వాల్​కు చెందిన స్టాక్​ మార్కెట్​ నిపుణులు చందన్​ తపారియా తెలిపారు. బడ్జెట్​కు ముందు వాటిని కొనుగోలు చేసి.. బడ్జెట్​ ప్రసంగం తర్వాత రివ్యూ చేయాలని సూచించారు. అంచనాలకు తగ్గట్టు బడ్జెట్​ ఉంటే.. ఆ స్టాక్స్​కు దీర్ఘకాలం వరకు హోల్డ్​ చేయవచ్చని స్పష్టం చేశారు. అలా జరగకపోతే.. షార్ట్​ టర్మ్​లో ప్రాఫిట్​లను బుక్​ చేసుకోవాలని వివరించారు.

ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు.

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. ఏదైనా స్టాక్​లో పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్​ను సంప్రదించడం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం