తెలుగు న్యూస్  /  Business  /  Boult Rover Pro Smartwatch Launched In India Check Price Specifications Features All Details

Boult Rover Pro: సూపర్ డిస్‍ప్లేతో బోల్ట్ రోవర్ ప్రో స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర, ఫీచర్ల వివరాలివే

13 April 2023, 15:07 IST

    • Boult Rover Pro Smartwatch: బోల్ట్ రోవర్ ప్రో స్మార్ట్‌వాచ్ వచ్చేసింది. ఆకర్షణీయమైన డిస్‍ప్లేతో అడుగుపెట్టింది.
Boult Rover Pro: సూపర్ డిస్‍ప్లేతో బోల్ట్ రోవర్ ప్రో స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Boult Audio)
Boult Rover Pro: సూపర్ డిస్‍ప్లేతో బోల్ట్ రోవర్ ప్రో స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Boult Audio)

Boult Rover Pro: సూపర్ డిస్‍ప్లేతో బోల్ట్ రోవర్ ప్రో స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Boult Audio)

Boult Rover Pro Smartwatch: దేశీయ కంపెనీ బోల్ట్ ఆడియో (Boult Audio) నుంచి రోవర్ సిరీస్‍లో మరో స్మార్ట్‌వాచ్ అడుగుపెట్టింది. బోల్ట్ రోవర్ ప్రో (Boult Rover Pro) వాచ్ లాంచ్ అయింది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉండే సూపర్ అమోలెడ్ డిస్‍ప్లే ఈ వాచ్‍కు హైలైట్‍గా ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. బోల్ట్ రోవర్ ప్రో స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలివే.

బోల్ట్ రోవర్ ప్రో స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేన్లు

Boult Rover Pro Specifications: 1.43 ఇంచుల సూపర్ అమోలెడ్ కర్వ్డ్ డిస్‍ప్లేను బోల్ట్ రోవర్ ప్రో స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, 446x446 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉంటుంది. 150 వరకు విభిన్నమైన వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి.

బ్లూటూత్ 5.2 వెర్షన్‍తో Boult Rover Pro స్మార్ట్‌వాచ్ వచ్చింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. డయల్ ప్యాడ్, సింక్ కాంటాక్ట్ ఫీచర్లు ఉంటాయి.

నిరంతర హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ సాచురేషన్ ఎస్‍పీవో2 ట్రాకర్, స్లీప్ మానిటరింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ హెల్త్ ఫీచర్లను Boult Rover Pro స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 100కుపైగా స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది.

ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ బోల్ట్ రోవర్ ప్రో (Boult Rover Pro) స్మార్ట్‌వాచ్ 7 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్‍తో వాడితే కాస్త తక్కువ రావొచ్చు. 10 నిమిషాల చార్జింగ్‍తోనే 2 రోజులు వాడుకునేలా ఈ వాచ్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది. చార్జింగ్ కోసం యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్‍కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. పిన్ ప్రైవసీ ఫీచర్ ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్‍ను రోవర్ ప్రో వాచ్ కలిగి ఉంది.

బోల్ట్ రోవర్ ప్రో స్మార్ట్‌వాచ్ ధర, సేల్

Boult Rover Pro Smartwatch Price: బోల్ట్ రోవర్ ప్రో స్మార్ట్‌వాచ్ ధర రూ.2,499గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈ వాచ్ సేల్‍కు అందుబాటులోకి వచ్చింది. వాచ్‍తో పాటు అదనంగా రెండు డిటాచబుల్ స్ట్రాప్స్ వస్తాయి.