తెలుగు న్యూస్  /  Business  /  Fire Boltt Launches Pristine Smartwatch For Women With Attractive Design Check Price Specifications Sale Starts Via Flipkart

New Smartwatch: మహిళల కోసం ప్రత్యేకంగా ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్‌వాచ్‍ లాంచ్: నేడే సేల్

04 April 2023, 12:05 IST

    • Fire-Boltt Pristine Smartwatch: మహిళల కోసం ప్రత్యేకమైన డిజైన్‍తో ప్రిస్టీన్ స్మార్ట్‌వాచ్‍ను ఫైర్ బోల్ట్ లాంచ్ చేసింది. ఈ వాచ్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఇక్కడ చూడండి.
New Smartwatch: మహిళల కోసం ప్రత్యేకంగా ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్‌వాచ్‍ లాంచ్: నేడే సేల్ (Photo: Fire-Boltt)
New Smartwatch: మహిళల కోసం ప్రత్యేకంగా ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్‌వాచ్‍ లాంచ్: నేడే సేల్ (Photo: Fire-Boltt)

New Smartwatch: మహిళల కోసం ప్రత్యేకంగా ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్‌వాచ్‍ లాంచ్: నేడే సేల్ (Photo: Fire-Boltt)

Fire-Boltt Pristine Smartwatch: దేశీయ బ్రాండ్ ఫైర్ బోల్ట్ (Fire-Boltt) విభిన్న డిజైన్‍లతో స్మార్ట్‌వాచ్‍లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే మహిళల కోసం ప్రత్యేక లగ్జరీ ఎడిషన్ స్మార్ట్‌వాచ్‍ను లాంచ్ చేసింది. ఫైర్ బోల్ట్ ప్రిస్టీన్ పేరుతో ఈ స్మార్ట్‌వాచ్‍ను నేడు (ఏప్రిల్ 4) విడుదల చేసింది. మహిళలకు సూటయ్యేలా దీన్ని డిజైన్ చేసినట్టు పేర్కొంది. ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో నేడు ఈ వాచ్ తొలిసారి సేల్‍కు వచ్చింది. డిజైన్ పరంగా ఈ వాచ్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఐదు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. స్టీల్ స్ట్రాప్ ఆప్షన్ కూడా ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తోంది. ఫైర్ బోల్ట్ ప్రిస్టీన్ స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

Bajaj Pulsar 400 : బజాజ్​ పల్సర్​ 400 లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ లీక్​!

ఫైర్ బోల్ట్ ప్రిస్టీన్ స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Fire-Boltt Pristine Smartwatch Specifications: 1.32 ఇంచుల హెచ్‍డీ ఫుల్ టచ్ రౌండ్ షేప్డ్ డిస్‍ప్లేతో ఫైర్ బోల్ట్ ప్రిస్టీన్ స్మార్ట్‌వాచ్ వస్తోంది. 360x360 పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది. మెటల్ బాడీ, రెండు మెటల్ బటన్లను ఈ వాచ్ కలిగి ఉంది. లుక్‍పరంగా ఈ వాచ్ స్టైలిష్‍గా కనిపిస్తోంది. విభిన్నమైన వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి.

బ్లూటూత్ కాలింగ్

Fire-Boltt Pristine Smartwatch: బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఫైర్ బోల్ట్ ప్రిస్టీన్ స్మార్ట్‌వాచ్ వస్తోంది. ఇందుకోసం ఈ వాచ్‍లో మైక్రోఫోన్, స్పీకర్ ఉంటాయి. బ్లూటూత్ ద్వారా ఫోన్‍కు కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. డయల్ ప్యాడ్, కాంటాక్టులను సింక్ చేసుకునే సదుపాయాలు ఉంటాయి. దీంతో నేరుగా వాచ్ నుంచి కాల్స్ చేసుకోవచ్చు. మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్నప్పు నోటిఫికేషన్లను పొందడంతో పాటు వాచ్ ద్వారానే మ్యూజిక్, కెమెరాను కూడా కంట్రోల్ చేయవచ్చు.

హెల్త్ ఫీచర్లు, బ్యాటరీ లైఫ్

Fire-Boltt Pristine Smartwatch: హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‍పీఓ2 ట్రాకర్, స్లీప్ మానిటరింగ్, మెనిస్ట్రువల్ సైకిల్ రిమైండర్ లాంటి హెల్త్ ఫీచర్లను ఫైర్ బోల్ట్ ప్రిస్టీన్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 60కుపైగా విభిన్నమైన స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని ఫైర్ బోల్ట్ చెబుతోంది. అయితే బ్లూటూత్ కాలింగ్‍ను ఎక్కువగా వాడితే మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది.

ఫైర్ బోల్ట్ ప్రిసీన్ స్మార్ట్‌వాచ్ ధర, సేల్

Fire-Boltt Pristine Smartwatch price: ఫైర్ బోల్ట్ ప్రిస్టీన్ స్మార్ట్‌వాచ్ ధర రూ.2,999గా ఉంది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart), ఫైర్ బోల్ట్ వెబ్‍సైట్‍లో నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఈ వాచ్ సేల్‍కు వచ్చింది. పింక్, వైట్, వైట్ ఓషియన్ స్ట్రాప్, వైట్ ప్లాటినమ్ స్ట్రిప్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది.