తెలుగు న్యూస్  /  బిజినెస్  /  How Apple Avoids Mass Layoffs: యాపిల్ కంపెనీలో లే ఆఫ్స్ లేవు.. ఎందుకో తెలుసా?

How Apple Avoids Mass Layoffs: యాపిల్ కంపెనీలో లే ఆఫ్స్ లేవు.. ఎందుకో తెలుసా?

HT Telugu Desk HT Telugu

11 February 2023, 17:01 IST

    • How Apple Avoids Mass Layoffs: మైక్రోసాఫ్ట్, మెటా, ఆల్ఫాబెట్, సిస్కో, ఆమెజాన్.. ఇలా దాదాపు అన్ని టెక్నాలజీ దిగ్గజ సంస్థలు లే ఆఫ్ (Layoff) బాట పట్టాయి. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ ఇంతవరకు యాపిల్ (Apple) సంస్థ మాత్రం ఎలాంటి లే ఆఫ్ (Layoff) ప్రకటనలు చేయలేదు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

How Apple Avoids Mass Layoffs: ఐ ఫోన్(iPhone), ఐ ప్యాడ్ (iPad) వంటి ప్రముఖ మొబైల్, ట్యాబ్, ల్యాప్టాప్ తదితర ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ యాపిల్ (Apple).. ఇతర టెక్ మేజర్ల మాదిరిగా ఉద్యోగులను తొలగించే (layoff) నిర్ణయాలు తీసుకోలేదు. సమర్ధ నిర్వహణ, ప్రణాళికతో కూడిన ముందు చూపు కారణంగా యాపిల్ (Apple) కు ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం రాలేదు.

How Apple Avoids Mass Layoffs: కరోనా మహమ్మారి సమయంలో..

కరోనా మహమ్మారి (corona) సమయంలో చాలా సంస్థలు విపరీతంగా రిక్రూట్ మెంట్ (recruitment) చేపట్టాయి. అవసరమైన సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను చేర్చుకున్నాయి. ఉదాహరణకు కరోనా (corona) మహమ్మారి వల్ల వర్చువల్ మీటింగ్ ల కారణంగా అత్యంత ప్రయోజనం పొందిన సంస్థ జూమ్ టెక్నాలజీస్ (Zoom Technologies). కరోనా సమయంలో ఆ సంస్థ పెద్ద ఎత్తున ఉద్యోగులను చేర్చుకుంది. ఇప్పుడు తమ మొత్తం ఉద్యోగులలో నుంచి 15% ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.

How Apple Avoids Mass Layoffs: యాపిల్ కు ఆ సమస్య లేదు..

కరోనా (corona) సమయంలో యాపిల్ సంస్థ (Apple) చాలా ప్రణాళికాబద్ధంగా రిక్రూట్ మెంట్ చేపట్టింది. చాలా స్వల్ప సంఖ్యలో ఉద్యోగులను చేర్చుకుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (research and development) విభాగాన్ని మినహాయిస్తే, వేరే ఏ విభాగం పైనా ఎక్కువగా పెట్టుబడులు పెట్టలేదు. అంతేకాదు, కరోనా సమయంలో, ఒక్కో కొత్త రిక్రూటీపై ఇతర కంపెనీలు పొందిన సగటు ఆదాయం కన్నా యాపిల్ (Apple) మెరుగైన ఆదాయాన్ని సాధించింది. ఆ సమయంలో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించిన కారణంగా ఇప్పుడు లే ఆఫ్స్ (layoffs) ప్రకటించాల్సిన అవసరం యాపిల్ కు పడలేదు.

How Apple Avoids Mass Layoffs: సమర్ద నిర్వహణ

భవిష్యత్ ప్రణాళిక విషయంలో ఇతర కంపెనీల కన్నా యాపిల్ (Apple) సమర్ధవంతంగా వ్యవహరించింది. కరోనా (corona) సమయంలో ఆచితూచి రిక్రూట్ మెంట్ చేపట్టింది. కాస్ట్ కట్టింగ్ పై అప్పటి నుంచే దృష్టి పెట్టింది. దాంతో, ఇప్పుడు ఆర్థిక మాంద్యం ప్రభావం యాపిల్ (Apple) పై పెద్దగా పడడం లేదు. అనవసరంగా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నామని ఇప్పుడు ఇతర మేజర్ టెక్ (major tech companies) కంపెనీలన్నీ వాపోతున్న సమయంలో, ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకుండా యాపిల్ (Apple) రికార్డు సృష్టించింది. 2020 -2022 మధ్య యాపిల్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 20% మాత్రమే పెరిగింది. అదే సమయంలో ఆల్ఫాబెట్ (Alphabet) లో ఉద్యోగుల సంఖ్య 60% పెరిగింది. ఆమెజాన్ (Amazon) లో దాదాపు 100% పెరిగింది. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు (Alphabet, Amazon) కలిసి సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

టాపిక్