Zoom layoff: “30 నిమిషాల్లో మెయిల్ వస్తుంది”.. 1,300 మంది ఉద్యోగుల తీసివేత.. సీఈవో వేతనంలో 98శాతం కోత-zoom layoff 1300 employees ceo eric yuan to take 98 percent pay cut ebay also cuts jobs ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Zoom Layoff 1300 Employees Ceo Eric Yuan To Take 98 Percent Pay Cut Ebay Also Cuts Jobs

Zoom layoff: “30 నిమిషాల్లో మెయిల్ వస్తుంది”.. 1,300 మంది ఉద్యోగుల తీసివేత.. సీఈవో వేతనంలో 98శాతం కోత

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 08, 2023 08:36 AM IST

Zoom layoff: 1,300 మంది ఉద్యోగులను సంస్థ నుంచి తొలగిస్తున్నట్టు జూమ్ ప్రకటించింది. ఆ సంస్థ సీఈవో వేతనంలో భారీ కోత ఉండనుంది.

Zoom layoff: “30 నిమిషాల్లో మెయిల్ వస్తుంది”.. 1,300 మంది ఉద్యోగుల తీసివేత.. సీఈవో వేతనంలో 98శాతం కోత
Zoom layoff: “30 నిమిషాల్లో మెయిల్ వస్తుంది”.. 1,300 మంది ఉద్యోగుల తీసివేత.. సీఈవో వేతనంలో 98శాతం కోత (Reuters)

Zoom layoff: టెక్ లేఆఫ్స్ (Layoff Trend) కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యోగుల తొలగింపును సంస్థలు ప్రకటిస్తున్నాయి. వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ జూమ్ (Zoom) కూడా ఈ లేఆఫ్ లిస్ట్‌లోకి వచ్చింది. ఏకంగా సంస్థలో 15 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు నేడు ప్రకటించింది. అంటే సుమారు 1,300 మంది ఎంప్లాయిస్‍కు ఉద్వాసన పలుకుతున్నామని పేర్కొంది. దీంతో పాటు జూమ్ సీఈవో ఎరిక్ యువాన్.. తన వేతనంలో 98శాతం భారీ కోత విధించుకున్నారు. ఈ తొలగింపుతో ప్రభావితమయ్యే ఉద్యోగులు.. 30 నిమిషాల్లో మెయిల్ అందుకుంటారని బ్లాగ్‍లో ఎరిక్ వెల్లడించారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ప్రకటించారు.

అప్పుడు మూడింతలు

Zoom layoff: 2020లో కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో ప్రజలు ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో తమ జూమ్ సర్వీస్‍లకు భారీ డిమాండ్ ఏర్పడిందని, అప్పటి నుంచి తమ సిబ్బందిని 24 నెలల్లో మూడు రెట్లు పెంచుకున్నట్టు ఆ సంస్థ సీఈవో ఎరిక్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం డిమాండ్ తగ్గిపోవడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి ఉద్యోగుల తొలగింపునకు కారణమనేలా చెప్పారు.

“అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఉంది. ఈ ప్రభావం వినియోగదారులపై పడుతోంది. అంటే మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి. మనల్ని మనం రీసెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలా అయితేనే ఆర్థిక వాతావరణానికి అనుగుణంగా కస్టమర్లకు సేవలు అందించగలం. జూమ్.. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించగలం” అని తన బ్లాక్ పోస్టులో జూమ్ సీఈవో ఎరిక్ పేర్కొన్నారు. ఉద్యోగులను ఉద్దేశించి ఈ అభిప్రాయాలను వెల్లడించారు.

ఉద్యోగులకు క్షమాపణ

Zoom layoff: తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకుంటున్నామని జూమ్ సీఈవో ఎరిక్ యువాన్ పేర్కొన్నారు. సంస్థ నుంచి తొలగింపునకు గురవుతున్న ఉద్యోగులకు క్షమాపణ చెప్పారు. “ఎంతో కఠినమైన నిర్ణయమైనా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది. సుమారు సిబ్బందిలో 15 శాతాన్ని తగ్గించుకుంటున్నాం. అంటే దాదాపు 1,300 మంది టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్ ఉద్యోగులకు గుడ్‍బై చెబుతున్నాం” అని ఆయన పేర్కొన్నారు.

30 నిమిషాల్లో మెయిల్

Zoom Layoff: యూఎస్ నుంచి పని చేస్తూ.. తొలగింపు జాబితాలో ఉన్న ఉద్యోగులు 30 నిమిషాల్లో అందుకు సంబంధించిన మెయిల్ అందుకుంటారని జూమ్ సీఈవో ఎరిక్.. బ్లాగ్‍లో వెల్లడించారు. వేరే దేశాల్లోని ఉద్యోగులకు అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి సమాచారం కూడా అందిస్తామని తెలిపారు. తొలగించిన ఉద్యోగులకు 16 వారాల వేతనాన్ని పరిహారంగా ఇవ్వనుంది జూమ్.

ఈబే కూడా..

EBay Layoff: అమెరికన్ ఈ-కామర్స్ సంస్థ ఈబే కూడా ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. సంస్థ నుంచి 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నామని వెల్లడించింది. సిబ్బందిని 4 శాతం తగ్గించుకుంటున్నామని పేర్కొంది. అమ్మకాలు తగ్గటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ సంస్థ పేర్కొంది. ఆర్థిక అనిశ్చితినే ఈబే కూడా కారణంగా చెప్పింది.

మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్, ఐబీఎం, డెల్, హెచ్‍పీ సహా చాలా కంపెనీలు ఇప్పటి వరకు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఆర్థిక మాంద్యం భయాలు, డిమాండ్ తగ్గడం కారణాలతో సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్