తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rains In Andhra Pradesh : ఏపీకి తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Rains In Andhra Pradesh : ఏపీకి తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

HT Telugu Desk HT Telugu

19 October 2022, 7:36 IST

google News
    • Andhra Pradesh and Telangana Weather Update : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసరాలపై ఉపరితల ఆవర్తంన కొనసాగుతోంది. ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Rains In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు(Rains) పడే అవకాశం ఉందని వాతారవణ శాఖ హెచ్చరించింది. అక్టోబర్ 20న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. 22వ తేదీ వరకు ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి.. వాయుగుండంగా మారుతుందని అంచనా. వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అయితే బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ, తెలంగాణ(Telangana)లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి.

తీరంలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వేగం 55 కిలోమీటర్లు దాటే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. శ్రీకాకుళం(Srikakulam), విజయనగరం, విశాఖపట్నం(Visakhapatnam)లో నేడు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వానలు పడనున్నాయి. అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది.

అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని ఐఎండీ(IMD) పేర్కొంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడనున్నాయి.

తెలంగాణలోనూ వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ(Nalgonda), నాగర్ కర్నూలు, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్(Hyderabad), రంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు ఉన్నాయి. ఇప్పటికే భాగ్యనగరంలో చాలా రోజులు వర్షాలు పడుతున్నాయి.

తదుపరి వ్యాసం