వాతావరణ శాఖ చల్లని కబురు.. ఏపీలో మోస్తరు వర్షాలు, తెలంగాణలో చల్లని గాలులు!
ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
భానుడి భగభగలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లటి కబురు అందించింది. 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రతో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవగా.. తెలంగాణలో చల్లని గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘామృతం కావటంతో కాస్త చల్లబడింది. ఫలితంగా ప్రజలకు కాస్త ఊరట లభించింది. విశాఖతో పాటు పలు జిల్లాల పరిధిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఉష్ణోగ్రతల స్థాయిల 3 డిగ్రీల మేర తగ్గిపోయే అవకాశం ఉంది. ఇక అగ్నిగోళంగా మండిపోతున్న సీమ జిల్లాల్లో కూడా పరిస్థితి మారేలా కనిపిస్తోంది. ఆకాల వర్షాల ప్రభావంతో వాతావరణం చల్లబడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.
మరోవైపు తెలంగాణలోని పలు చోట్ల చిరుజల్లులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతంమై ఉండగా.. ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో ఉష్ణోగ్రతల ప్రభావం తగ్గింది.
టాపిక్