IMD Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. మరో 2 రోజులు అతి భారీ వర్షాలు-weather updates of telugu states over imd issued rain alert ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Imd Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. మరో 2 రోజులు అతి భారీ వర్షాలు

IMD Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. మరో 2 రోజులు అతి భారీ వర్షాలు

HT Telugu Desk HT Telugu
Sep 11, 2022 07:30 AM IST

IMD Weather Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

<p>తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు</p>
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు (imd)

Rains in telugu states: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇది కాస్త మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి మధ్య ట్రోపోస్పియర్ స్థాయిల వరకు విస్తరించి ఉందని పేర్కొంది. మరోవైపు తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Rains in Telangana: గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా మోసర్తు వర్షాలు కురుస్తుండగా...మరో 2 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆయా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మాల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.

హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అనవసర ప్రయాణాలు, విద్యుత్ స్తంభాలు, లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఏపీకి వర్ష సూచన..

rains in andhrapradesh: ఉత్తర ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం, సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ హెచ్చరించింది. సోమవారం వరకు ఒడిశా తీరం వెంబడి, వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్రంలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.

అల్పపీడనం ప్రభావంతో కోస్తా అంతటా వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

Whats_app_banner

సంబంధిత కథనం