Rain Alert To Telangana : వెదర్ అలర్ట్.. మరికొన్ని రోజులు వర్షాలు-rain alert to telugu states for coming days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rain Alert To Telangana : వెదర్ అలర్ట్.. మరికొన్ని రోజులు వర్షాలు

Rain Alert To Telangana : వెదర్ అలర్ట్.. మరికొన్ని రోజులు వర్షాలు

HT Telugu Desk HT Telugu
Oct 18, 2022 05:56 PM IST

Weather Update To Telangana : తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో మరో 48 గంటలు వర్షాలు పడనున్నాయి.

<p>మరికొన్ని రోజులు వర్షాలు</p>
మరికొన్ని రోజులు వర్షాలు

తెలంగాణ(Telangana)లో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉంది. 20వ తేదీన అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
yearly horoscope entry point

ఈ రోజు ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతు ఉంది. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో వచ్చే.. 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ కేంద్రం(IMD) తెలిపింది. 22 ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత క్రమంగా బలపడుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే ఛాన్స్ ఉంది.

మరోవైపు ఏపీలోనూ వర్షాలు(Rains) పడే సూచనలు ఉన్నాయి. శ్రీకాకుళం(Srikakulam), విజయనగరం, విశాఖపట్నం(Visakhapatnam)లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్(IMD Yellow Alert) జారీ చేసింది. అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. పశ్చిమ గోదావరి, కొనసీమ కోస్తా ప్రదేశాల్లో అక్కడక్కడ వానలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. .

అక్టోబర్ 20న బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అక్టోబర్ 22న తుపాను ఉందని ఏపీ వెదర్ మ్యాన్(AP Weather Man) అంచనా వేశారు. అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని ఐఎండీ పేర్కొంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడనున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం