Rain alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. అక్కడ అతి భారీ వర్షాలు!-rain alert heavy rains in these states as low pressure area turns into depression ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rain Alert: Heavy Rains In These States As Low-pressure Area Turns Into Depression

Rain alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. అక్కడ అతి భారీ వర్షాలు!

Sharath Chitturi HT Telugu
Aug 19, 2022 01:56 PM IST

Rain alert in India : బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ఏర్పడటం.. 15 రోజుల వ్యవధిలో ఇది మూడోసారి.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. అక్కడ అతి భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. అక్కడ అతి భారీ వర్షాలు! (Mint)

Rain alert in India : బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఈశాన్య, తూర్పు- మధ్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్​, మయన్మార్​ తీరం వద్ద కేంద్రీకృతమై ఉంది. శనివారం ఉదయం నాటికి ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

"శుక్రవారం ఉదయం 8:30 గంటలకు.. ఒడిశా బాలాసోర్​కు 250కి.మీల దూరం (తూర్పు-అగ్నేయం)లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది బాలాసోర్​- సాగర్​ ద్వీపాలను ఈరోజు సాయంత్రానికి దాటే అవకాశం ఉంది. రానున్న ఆరు గంటల్లో.. ఇది వాయువ్యంవైపు ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉంది. రేపు ఉదయానికి అల్పపీడం మరింత తీవ్రరూపం దాల్చవచ్చు. అక్కడి నుంచి ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్​, ఉత్తర్​ ఛత్తీస్​గఢ్​, గ్యాంగ్​టిక్​ పశ్చిమ్​ బెంగాల్​వైపు ప్రయాణించవచ్చు," అన ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది.

Low pressure area in Bay of Bengal : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం.. గత 15రోజుల్లో ఇది మూడోది. తాజా పరిణామాలతో.. ఒడిశాలోని రాయగడ, జగత్​సింగ్​పూర్​, సుపర్నరేఖ, ఉత్తర భాగంలో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు ముంచ్చెత్తే ముప్పు కూడా ఉంది.!

కాగా.. ఒడిశాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయ. జగత్​సింగ్​పూర్​లో గత రాత్రి 107ఎంఎంల వర్షపాతం నమోదైంది.

ఒడిశాలో భారీ వర్షాల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల అధికారులకు నోటీసులు జారీ చేసింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.

ఒడిశాలో భారీ వర్షాల కారణంగా.. కింఝార్​, బాలాసోర్​, భద్రక్​, మయూర్​భంజ్​ జిల్లాలకు రెడ్​ అలర్ట్​ జారీ చేసింది ప్రభుత్వం.

Rains in Telangana : ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా.. తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం