Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలంగాణకు వర్ష సూచన
ఉత్తర బంగాళాఖాతంలో రేపు ( ఆగస్టు 19న) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు వర్ష సూచన ఇచ్చింది.
Rains in Telangana: ఈ నెల 19న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఫలితంగా తెలంగాణ వైపు నైరుతి దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
ఇక హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి దిశ నుంచి (గాలి వేగం గంటకు 06- 08 కి.మీ) గాలులు వీచ్చే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలోనూ వర్షాలు...
ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ప్రాంతంలో రేపు ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక దక్షిమ కోస్తాతో పాటు సీమ జిల్లాలకు కూడా వర్ష సూచన ఉంది. తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వెల్లడించింది.
మరోవైపు అల్పపీడన ప్రభావతం… ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
సంబంధిత కథనం