Rain Alert: వాయుగుండంగా అల్పపీడనం… ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్-weather updates of telangana over imd issued rain alert ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Weather Updates Of Telangana Over Imd Issued Rain Alert

Rain Alert: వాయుగుండంగా అల్పపీడనం… ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Mahendra Maheshwaram HT Telugu
Aug 19, 2022 05:48 PM IST

Rains in Telangana: హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... వాయుగుండంగా బలపడింది.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు

Rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల 6 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఎల్లో అలర్ట్...

తెలంగాణలో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్ర అల్పపీడనం ఇవాళ ఉదయం వాయుగుండంగా బలపడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అక్కడకక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని పేర్కొంది. గాలి వేగం గంటలకు 30- 40 కి.మీ వీస్తాయని తెలిపింది.

హైదరాబాద్ లో వర్షం…

శుక్రవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌ లోని పలుప్రాంతాల్లో భారీ వర్షంకురిసింది. యూసుఫ్గూడా, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్నగర్, అమీర్పేట్ ప్రాంతాల్లో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం