Rain In Hyderabad : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం
భాగ్యనగరంలో మరోసారి భారీ వర్షం దంచికొడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి.. సాయంత్రం కాగానే వర్షం పడుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మొదలైన వాన పడుతూనే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లిలో భారీ వర్షం పడింది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి,షేక్‌పేట, మణికొండలో విపరీతంగా వాన కొట్టింది.
విపరీతంగా వాన పడటంతో.. వరద నీటితో.. రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వరద రోడ్ల మీద భారీగా చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే కొన్ని రోజులు కురుస్తున్న వర్షాల నుంచి భాగ్యనగరంలోని పలు ఏరియాలో ఇంకా కోలుకోలేదు. లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. మరోసారి భారీ వర్షం రావడంతో లోతట్టు ప్రాంతాల వారు.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సంబంధిత కథనం