Telangana Rain Alert : ఐఎండీ అలర్ట్.. ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన-heavy rain alert to telangana for coming days ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Heavy Rain Alert To Telangana For Coming Days

Telangana Rain Alert : ఐఎండీ అలర్ట్.. ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Telangana Weather Update : తెలంగాణలో వర్షాలు మరోసారి దంచికొట్టనున్నాయి. భాగ్యనగరానికి మరోసారి వరుణ గండం పొంచి ఉంది. మరో 48 గంటలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

భాగ్యనగరంతోపాటుగా.. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ(IMD) హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో భారీ వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఎక్కువ శాతం వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో అధికారులు ముందస్తు ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. ఇప్పటికే భాగ్యనగరంలో ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో చినుకులు పడుతున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే రెండు రోజులు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. హైదరాబాద్‌లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రాబోయే రెండు రోజులు.. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఎక్కువ వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Rains In Andhra Pradesh : ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడతాయని అధికారులు హెచ్చరించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయి.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాయలసీమలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

WhatsApp channel

సంబంధిత కథనం