Rain alert for AP, Telangana: మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
AP Telangana Rain alert: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు ఐఎండీ ప్రకటించింది.
AP Telangana Rain alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. ఏపీ, తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. దాని ప్రభావంతో మోస్తరు వర్ష సూచన ఉండగా, మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాయువ్య, ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దిగువ ట్రోపో ఆవరణంలో బలమైన గాలులు ఉన్నాయి.
Rains In Telangana : తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అకాశం ఉంది. కొన్ని చోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది.
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరో రెండు మూడు రోజులు వర్షాలు పడనున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది.
Rains In Andhra Pradesh : ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడతాయని అధికారులు హెచ్చరించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాయలసీమలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.