T Congress: తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ కొత్త రూపు… ప్రత్యేకతలు ఇవే-telangana congress unveiled new telangana thalli statue on 17 september ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Telangana Congress Unveiled New Telangana Thalli Statue On 17 September

T Congress: తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ కొత్త రూపు… ప్రత్యేకతలు ఇవే

Sep 18, 2022, 12:47 PM IST HT Telugu Desk
Sep 18, 2022, 12:47 PM , IST

  • New Telangana Thalli Statue,: సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్… కొత్త తెలంగాణ తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

తెలంగాణ తల్లి విగ్రహం.... తలపై కిరీటం, ఒక చేతిలో జొన్న, మొక్క కంకులను పట్టుకొని మరో చేతిలో బతుకమ్మను పట్టుకున్న రూపం గుర్తుకు వస్తుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త ఆవిష్కరించింది. సెప్టెంబర్ 17వ తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

(1 / 5)

తెలంగాణ తల్లి విగ్రహం.... తలపై కిరీటం, ఒక చేతిలో జొన్న, మొక్క కంకులను పట్టుకొని మరో చేతిలో బతుకమ్మను పట్టుకున్న రూపం గుర్తుకు వస్తుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త ఆవిష్కరించింది. సెప్టెంబర్ 17వ తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.(HT)

కుడి చేతిని ఎత్తి ఆశీర్వదిస్తున్నట్లు, ఎడమ చేతిలో కర్ర పట్టుకుని.. సిగతో, నుదుట తిలకం, చెవి దిద్దులు, ముక్కు పుడక, మెడలో వెండి కడ్డీ ధరించి.. అంచు చీర, సంప్రదాయ చీరకట్టుతో నిలబడి విగ్రహాన్ని రూపొందించారు. 

(2 / 5)

కుడి చేతిని ఎత్తి ఆశీర్వదిస్తున్నట్లు, ఎడమ చేతిలో కర్ర పట్టుకుని.. సిగతో, నుదుట తిలకం, చెవి దిద్దులు, ముక్కు పుడక, మెడలో వెండి కడ్డీ ధరించి.. అంచు చీర, సంప్రదాయ చీరకట్టుతో నిలబడి విగ్రహాన్ని రూపొందించారు. (HT)

ఈ విగ్రహాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.. తెలంగాణ తల్లి కష్టజీవి, ఊరి సంస్కృతికి ప్రతిరూపమని అన్నారు రేవంత్ రెడ్డి.

(3 / 5)

ఈ విగ్రహాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.. తెలంగాణ తల్లి కష్టజీవి, ఊరి సంస్కృతికి ప్రతిరూపమని అన్నారు రేవంత్ రెడ్డి.(HT)

విగ్రహంతో పాటుగా రాష్ట్రీయ గీతం, కొత్త జెండా, వాహనాల రిజిస్ట్రేషన్ పేర్లలో టీఎస్‌కు బదులుగా టీజీ అని మార్చాలనే ఆలోచన కాంగ్రెస్ చేస్తోంది. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ మేరకు పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు కూడా పెట్టింది.

(4 / 5)

విగ్రహంతో పాటుగా రాష్ట్రీయ గీతం, కొత్త జెండా, వాహనాల రిజిస్ట్రేషన్ పేర్లలో టీఎస్‌కు బదులుగా టీజీ అని మార్చాలనే ఆలోచన కాంగ్రెస్ చేస్తోంది. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ మేరకు పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు కూడా పెట్టింది.(HT)

దేశానికి, తెలంగాణకు స్వాతంత్ర్యం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. 8 ఏళ్లుగా సెప్టెంబర్ 17 ను నిర్వహించని టీఆర్ఎస్ కు ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ను బీజేపీ దొంగిలించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. 1950 లో గాంధీ భవన్ కు పునాదులు వేసింది సర్దార్ పటేల్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఎస్ ను టీజీ గా మారుస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అందే శ్రీ రాసిన పాటను రాష్ట్ర గీతంగా మారుస్తామని ప్రకటించారు.

(5 / 5)

దేశానికి, తెలంగాణకు స్వాతంత్ర్యం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. 8 ఏళ్లుగా సెప్టెంబర్ 17 ను నిర్వహించని టీఆర్ఎస్ కు ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ను బీజేపీ దొంగిలించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. 1950 లో గాంధీ భవన్ కు పునాదులు వేసింది సర్దార్ పటేల్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఎస్ ను టీజీ గా మారుస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అందే శ్రీ రాసిన పాటను రాష్ట్ర గీతంగా మారుస్తామని ప్రకటించారు.(HT)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు