Telangana Govt: రేపు సెలవుదినంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Holiday on 17th September: తెలంగాణలో శనివారం (రేపు) సెలవుదినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
telangana govt announced holiday on 17th september: తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలను ఘనంగా చేపట్టింది తెలంగాణ సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక శనివారం సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సర్కార్ ఆదేశాలమేరకు శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడనున్నాయి.
మరోవైపు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి తెలంగాణ ప్రాంతం 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు వైభవంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. మూడు రోజుల పాటు ప్రారంభ కార్యక్రమాలు జరగనుండగా.. రేపు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా ఇవాళ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు.
భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions in Hyderabad: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర పోలీసులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల సందర్భంగా ఈ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు.రేపు(సెప్టెంబర్ 17వ తేదీ) ఎన్టీఆర్ స్టేడియంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ జరుగనుంది. 33 జిల్లాల నుండి 2300 బస్సులలో 1 లక్ష మంది సభకు హాజరయ్యే అవకాశం ఉంది.
telangana national integration day event in hyd:రేపు ఎన్టీఆర్ ఘాట్, అంబేద్కర్ విగ్రహం వద్ద కళాకారుల ప్రదర్శనలు, పలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్. ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ సభకు 1లక్ష మందితో మీటింగ్ జరుగనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 2300 బస్సులో 1 లక్షకు పైగా ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో సెంట్రల్ జోన్‌తో పాటు పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందిరా పార్కు చుట్టూ 3 కిలోమీటర్ల మేర పూర్తిగా స్థాయి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కవాడి గూడ, అశోక్ నగర్, ముషీరాబాద్, ఇందిరా పార్కు, లిబర్టీ, నారాయణ గూడ, రాణిగంజ్, నెక్ లెస్ రోడ్, పలు ఏరియా జంక్షన్‌లలో ట్రాఫిక్ పూర్తిగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. వీటిని ప్రయాణికులు దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు.