TS Cabinet Meeting: సెప్టెంబర్‌ 17న సమైక్యతా దినోత్సవం - కేబినెట్ నిర్ణయాలివే-ts cabinet key decision on 17th september over to celebrate telangana national integration day
Telugu News  /  Telangana  /  Ts Cabinet Key Decision On 17th September Over To Celebrate Telangana National Integration Day
సీఎం కేసీఆర్ ( ఫైల్ ఫొటో)
సీఎం కేసీఆర్ ( ఫైల్ ఫొటో) (twitter)

TS Cabinet Meeting: సెప్టెంబర్‌ 17న సమైక్యతా దినోత్సవం - కేబినెట్ నిర్ణయాలివే

03 September 2022, 19:06 ISTHT Telugu Desk
03 September 2022, 19:06 IST

telangana national integration day: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Telangana Cabinet decision on 17th September: శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. దాదాపు 3 గంటలపాటు మంత్రివర్గ సమావేశం కొనసాగింది. అయితే సెప్టెంబర్ 17వ తేదీ విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర నిర్ణయించింది. ఈనెల 16, 17, 18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబరు 17ను జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తామని మంత్రివర్గం ప్రకటించింది.

కేబినెట్ నిర్ణయాలు

సెప్టెంబర్ 16 వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ, యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలి.

సెప్టెంబర్ 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటి, పంచాయితీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలి.

అదే రోజు (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం బంజారా ఆదివాసీ భవన్ ల ప్రారంభోత్సవం. నక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు ఉంటుంది. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు.

సెప్టెంబర్ 18న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేయాలి. కవులు, కళాకారులను గుర్తించి సత్కరించాలి. ఘనంగా తెలంగాణ స్ఫూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి.

జిల్లాల వ్యాప్తంగా రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం.

పోడు భూములు సాగు చేసే వారు ఎంత మంది ఉన్నారు? ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? అనే విషయాలను సమీక్షించాలి

ప్రతి నియోజకవర్గంలో మరో 500 మందికి దళితబంధును విస్తరించాలి

గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగించాలని అధికారులను కేబినెట్‌ ఆదేశించింది.

కార్పొరేషన్లలో కో-ఆప్షన్‌ సభ్యుల సంఖ్య పెంపు..

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన అటవీ విశ్వవిద్యాలయంలో కొత్త పోస్టులను మంజూరు

సుంకిశాల నుంచి హైదరాబాద్‌ నగరానికి సాగు నీటి కోసం అదనంగా 33టీఎంసీల నీటిని శుద్ధి చేసి సరఫరా చేయాలని నిర్ణయం

రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణం కోసం 21 జిల్లా కేంద్రాల్లో స్థలాల కేటాయింపు

భద్రాచలం ముంపు ప్రాంతాల్లోని మొత్తం 2,016 కుటుంబాలకు నూతనంగా కాలనీలు నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయం

అసెంబ్లీ సమావేశాలపై చర్చ..!

Telangana Assembly Sessions: ఈనెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితేఅసెంబ్లీ సమావేశాలకు ఎజెండాను రూపొందించడంతోపాటు ఇతర అంశాలు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

centre invites cm kcr: సెప్టెంబర్ 17ను విమోచన దినంగా నిర్ణయించేందుకు కేంద్రం సిద్ధమైంది. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి అమిత్ షాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు వస్తారని స్పష్టం చేసింది. అయితే తాజాగా.... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా లేఖ రాసింది కేంద్ర సర్కార్. కేసీఆర్‌ను గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా రావాలని ఆహ్వానించింది. ఏడాది పాటు రాష్ట్రమంతా తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలని, ఇందులో కేంద్ర ప్రభుత్వం సైతం భాగస్వామ్యం అవుతుందని పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విమోచనం తర్వాత కొన్ని జిల్లాలు కర్ణాటక, మహారాష్ట్రలో కలిశాయని, అందుకే మూడు రాష్ట్రాలకు దీనితో సంబంధం ఉందని వివరించారు.

అయితే ఇదే క్రమంలో శనివారం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒైవైసీ కూడా అమిత్ షాతో పాటు కేసీఆర్ కు లేఖలు రాశారు. సెప్టెంబర్ 17వ తేదీని జాతీయ సమైక్యతా దినంగా గుర్తించాలని కోరారు.

టీఆర్ఎస్ ఎల్పీ భేటీ..

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ అయింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ సమావేశాలు. కేంద్రం వైఖరి వంటి పలు అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

టాపిక్