Owaisi Letter to Amith Sha: సెప్టెంబర్ 17 పై ఎంఐఎం కొత్త ప్రతిపాదన-aimim supremo asaduddin owaisi letter to amit shah and cm kcr over 17th september ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Aimim Supremo Asaduddin Owaisi Letter To Amit Shah And Cm Kcr Over 17th September

Owaisi Letter to Amith Sha: సెప్టెంబర్ 17 పై ఎంఐఎం కొత్త ప్రతిపాదన

HT Telugu Desk HT Telugu
Sep 03, 2022 05:42 PM IST

asaduddin owaisi on 17th september: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ లేఖ రాశారు. సెప్టెంబర్‌ 17ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలని కోరారు.

అసదుద్దీన్ ఓవైసీ (ఫైల్ ఫొటో)
అసదుద్దీన్ ఓవైసీ (ఫైల్ ఫొటో) (twitter)

asaduddin owaisi letter to amit shah:సెప్టెంబర్ 17.... తెలంగాణ రాజకీయ కాకను రేపుతోంది. ఇప్పటికే బీజేపీ స్పీడ్ పెంచటమే కాదు... హైదరాబాద్ లోనే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను జరిపేందుకు సిద్ధమైంది. అది ఏదో పార్టీ తరపున కాదు... ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్ణయించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎంఐఎంకి భయపడే కేసీఆర్... తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపటం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే... ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

asaduddin owaisi letter to cm kcr: శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లేఖలు రాశారు. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలని కోరారు. సెప్టెంబరు 17 అనేది పూర్వపు హైదరాబాద్ రాష్ట్రాన్ని యూనియన్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసిన రోజుకు గుర్తు అని చెప్పారు. ఆ రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటించాలని సూచించారు. వలసవాద, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటాలను జరుపుకోవడానికి ఇది ఒక సందర్భం అని లేఖలో ప్రస్తావించారు. లేఖను ట్విట్ లో కూడా పోస్టు చేశారు.

asaduddin owaisi on september 17: ‘‘హైదరాబాద్‌ రాష్ట్రాన్ని విలీనం చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబరు 17న కేంద్ర ప్రభుత్వం సంబరాలు జరుపుకోవాలని నిర్ణయించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. పలు సంస్థానాల విలీనం, రాష్ట్రాల ప్రవేశం అనేది నిరంకుశ పాలకుల నుంచి భూభాగాలను విముక్తి చేయడం మాత్రమే కాదని రాసుకొచ్చారు. జాతీయవాద ఉద్యమం ఈ భూభాగాల ప్రజలను స్వతంత్ర భారతదేశంలో అంతర్భాగంగా చూసింది. ఫలితంగా విముక్తి కంటే ‘‘జాతీయ సమైక్యత దినోత్సవం’’ అనే పదం సముచితంగా ఉండవచ్చు అని తెలిపారు.

విలీనం కోసం ముస్లింలు, హిందువులు కలిసి పోరాడారని అసదుద్దీన్ చెప్పారు. విలీనం తర్వాత పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం సుందర్ లాల్ కమిటీని కూడా ఏర్పాటు చేసిందని అన్నారు. నాటి ముస్లింపై దాడులు, ఇబ్బందుల గురించి కూడా నివేదికలో ప్రస్తావించిందని పేర్కొన్నారు. నాటి హైదరాబాద్ సంస్థానం ప్రజలు ఫ్యూడలిజం, నియంతృత్వంపై కలిసి పోరాడనని అన్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలో తుర్రేబాజ్ ఖాన్, షోయబుల్లాఖాన్ వంటి వారు ప్రాణాలు కోల్పోయారని లేఖలో ప్రస్తావించారు.

IPL_Entry_Point