Maoist movement: మావోల అలజడి..!ఆదిలాబాద్ అడవుల్లో ఏం జరుగుతోంది..?-police combing in adilabad forest amid suspicious movement of maoists ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Maoist Movement: మావోల అలజడి..!ఆదిలాబాద్ అడవుల్లో ఏం జరుగుతోంది..?

Maoist movement: మావోల అలజడి..!ఆదిలాబాద్ అడవుల్లో ఏం జరుగుతోంది..?

HT Telugu Desk HT Telugu
Sep 02, 2022 05:41 PM IST

Police combing in Adilabad forest area: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. బోథ్ అటవీ ప్రాంతంలో పోలీసులు రెండుమూడో రోజులుగా విస్తృత్తంగా కూంబింగ్ చేస్తున్నారు. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతోంది అన్న టెన్షన్ మొదలైంది.

<p>ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల కూంబింగ్ !</p>
ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల కూంబింగ్ !

Police intensifies combing in Adilabad forest: అదిలాబాద్ అడవులు... గడిచిన రెండు మూడురోజులుగా ఈ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.మళ్లీ మావోయిస్టులు ఎంట్రీ అయ్యారనే సమాచారం, బోథ్ అడవుల్లో గ్రైనేడ్ లభ్యం కావటమే అసలు కారణంగా తెలుస్తోంది. 20 రోజుల క్రితం బోథ్‌ మండలంలోని కైలాస్‌ టెకిడి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు.

మావోయిస్టులేనా..? ఎక్కడి దళం..?

suspicious movement of maoist in adilabad forest: కైలాస్‌ టెకిడి అటవీ ప్రాంతంలో గ్రెనేడ్‌ లభిచండంతో పోలీసులు అలర్ట్ అయిపోయారు. భద్రతా బలగాలు అడవుల్లో విసృత్తంగా కూంబింగ్ చేపట్టే పనిలో పడ్డాయి. అయితే గ్రెనేడ్‌ ఈ మధ్య కాలంలోనే పడిపోయినదిగా పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టుల బ్యాగుల నుంచి జారిపోయినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తుండగా.. ఎక్కడి నుంచి వచ్చారు..? ఎవరి దళం అన్నదానిపై కూపీ లాగే ప్రయత్నాల్లో ఉన్నారు. అడెల్లు దళంపై ప్రధానంగా అనుమానం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

combing in Adilabad forest: ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో కూంబింగ్, గ్రెనేడ్ లభ్యంపై పోలీసులు అధికారికంగా స్పందించటం లేదు. ఎలాంటి వివరాలను కూడా వెల్లడించటం లేదు. మరోవైపు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లతో పాటు ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. రిమోట్ ఏరియా గ్రామాల్లోకి వెళ్లవద్దని చెబుతున్నట్లు తెలుస్తోంది. వెళ్లాల్సి వస్తే సమాచారం ఇవ్వాలని చెబుతున్నారంట. అయితే మొత్తంగా ఏజెన్సీ ఏరియాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.

అప్పట్లో అధిక ప్రాబల్యం…

Maoist movement in United Andhrapradesh: ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా మావోయిస్టు ల ప్రాబల్యం లేకుండా పోయింది. కొన్ని జిల్లాల్లో అప్పడప్పుడు మావోయిస్టుల కదలికలు కన్పించాయి. పలు జిల్లాల్లో ఎన్ కౌంటర్లు కూడా చోటు చేసుకొన్నాయి. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు కూడా పోలీసుల ముందు లొంగిపోయారు. మరో వైపు మావోయిస్టు పార్టీలో రిక్రూట్ మెంట్ కూడా తగ్గిపోయింది. అయితే కొత్త రిక్రూట్ మెంట్ పై మావోయిస్టు పార్టీ దృష్టి పెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వీటిపై నిఘా పెట్టిన పోలీసులు.. ఎప్పుటికప్పుడు చర్యలు చేపడుతూ వస్తుండటంతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా మారింది.

తెలంగాణకు సరిహద్దుల్లోని చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నప్పటికి తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేకుండా పోయిందని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు చోటు చేసుకోవడంతో పోలీసులు ముందుస్తుగానే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

Whats_app_banner