తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live September 29, 2024: Ap Jobs : తిరుమలలో ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం.. ఇలా దరఖాస్తు చేసుకొండి
AP Jobs : తిరుమలలో ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం.. ఇలా దరఖాస్తు చేసుకొండి
AP Jobs : తిరుమలలో ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం.. ఇలా దరఖాస్తు చేసుకొండి

Andhra Pradesh News Live September 29, 2024: AP Jobs : తిరుమలలో ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం.. ఇలా దరఖాస్తు చేసుకొండి

29 September 2024, 21:52 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

29 September 2024, 21:52 IST

Andhra Pradesh News Live: AP Jobs : తిరుమలలో ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం.. ఇలా దరఖాస్తు చేసుకొండి

  • AP Jobs : టీటీడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆక్టోబర్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ పోస్టులకు సంబంధించి నెలకు రూ.2 లక్షల ఉంటుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

29 September 2024, 20:13 IST

Andhra Pradesh News Live: AP TDP : మాకు ఈ ఎమ్మెల్యే వద్దు.. మంగళగిరికి చేరిన తిరువూరు టీడీపీ పంచాయితీ

  • AP TDP : ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఆయనపై మీడియా ప్రతినిధులు, సొంత పార్టీ నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. కొలికపూడి కారణంగా తిరువూరులో పార్టీకి నష్టం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే అంతా సెట్ చేస్తానని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది.
పూర్తి స్టోరీ చదవండి

29 September 2024, 18:19 IST

Andhra Pradesh News Live: AP Rain Alert : ఏపీ ప్రజలకు అలర్ట్.. 24 జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం

  • AP Rain Alert : తమిళనాడు నుంచి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 24 జిల్లాల్లో సోమవారం వర్షాలు కురుస్తాయని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
పూర్తి స్టోరీ చదవండి

29 September 2024, 17:18 IST

Andhra Pradesh News Live: APSRTC Special : క‌డ‌ప ఆర్టీసీ జోన్ ప‌రిధిలో 758 దసరా ప్ర‌త్యేక బ‌స్సులు - హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుకే అత్య‌ధిక సర్వీసులు

  • APSRTC Dasara Special Buses : క‌డ‌ప ఆర్టీసీ జోన్ ప‌రిధిలో ద‌స‌రాకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈసారి 758 ప్ర‌త్యేక బ‌స్సులను నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల‌కే అత్య‌ధిక బ‌స్సులు నడపనుంది. అక్టోబరు 4 నుంచి 11వ తేదీ వరకు ఈ బస్సులు సర్వీసులు అందిస్తాయి.
పూర్తి స్టోరీ చదవండి

29 September 2024, 16:54 IST

Andhra Pradesh News Live: Dwaraka Tirumala : అక్టోబ‌ర్ 13 నుంచి 20 వ‌ర‌కు ద్వార‌కా తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామి తిరుక‌ల్యాణ ఉత్స‌వాలు

  • Dwaraka Tirumala : అక్టోబ‌ర్ 13 నుంచి 20 వ‌ర‌కు ద్వారకా తిరుమ‌లల‌లో.. వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆశ్వ‌యుజమాస దివ్య తిరుక‌ల్యాణ ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఎనిమిది రోజుల పాటు జ‌రిగే ఈ ఉత్స‌వాలను భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో నిర్వ‌హిస్తారు. ఈ ఉత్స‌వాల స‌మ‌యంలో భ‌క్తులు భారీగా వస్తారని ఈవో ఎన్‌విఎస్ఎన్ మూర్తి తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

29 September 2024, 15:34 IST

Andhra Pradesh News Live: Tirumala Laddu Row : కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ

  • Tirumala Laddu Row : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై.. సిట్‌ విచారణ కొనసాగుతోంది. తాజాగా.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరు భేటీ అయ్యారు. అవసరమైతే మరిన్ని బృందాలు ఏర్పాటు చేస్తామని సిట్ చీఫ్ స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

29 September 2024, 14:20 IST

Andhra Pradesh News Live: CJI at Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ డీవై చంద్రచూడ్

  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన సీజేఐ దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలితారు. వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.
పూర్తి స్టోరీ చదవండి

29 September 2024, 14:01 IST

Andhra Pradesh News Live: Anantapur : అనంత‌పురం జిల్లాలో ఘోరం.. పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రాలేద‌ని.. గొంతు కోసిన భ‌ర్త‌

  • Anantapur : అనంత‌పురం జిల్లాలో ఘోరం జరిగింది. పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రాలేద‌ని.. కోపంతో గొంతు కోసి హ‌తమార్చాడు ఓ భర్త. ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది. భార్య‌ను హ‌త‌మార్చి భ‌ర్త ప‌రార‌య్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు.
పూర్తి స్టోరీ చదవండి

29 September 2024, 13:05 IST

Andhra Pradesh News Live: Vizag Steel Plant : స్టీల్‌ప్లాంట్ న‌ష్టాలను భరించడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు - కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

  • Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలను భరించడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని కేంద్ర ఉక్కు శాఖ స‌హాయ మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను సెయిల్ విలీనం చేసేందుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

29 September 2024, 12:50 IST

Andhra Pradesh News Live: AP 3 Free Gas Cylinders : 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ఏపీ సర్కార్ కసరత్తు, త్వరలోనే విధివిధానాలు ప్రకటన

  • AP 3 Free Gas Cylinders : ఏపీలో అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది. తెల్లరేషన్ కార్డుదారులు 1.47 కోట్ల మంది కాగా..వీరికి 3 సిలిండర్లు పథకం అమలుచేస్తే రూ.3640 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.
పూర్తి స్టోరీ చదవండి

29 September 2024, 11:16 IST

Andhra Pradesh News Live: Tirumala One crore Seva Ticket : తిరుమల శ్రీవారి కోటి రూపాయల సేవా టికెట్-ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి వారిసేవలో

  • Tirumala One crore Seva Ticket : తిరుమల శ్రీవారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని సేవల్లో పాల్గొంటూ దర్శించుకునే భాగ్యం కలిగిస్తుందో టీటీడీ. ఇందుకు గాను భక్తులు రూ.కోటి సేవాల టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సేవా టికెట్ తో భక్తులు ఉదయాస్తమానం శ్రీవారిని దర్శించుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

29 September 2024, 9:40 IST

Andhra Pradesh News Live: Visakha Cyber Crime : విశాఖ‌లో ఐదుగురు సైబ‌ర్ నేర‌గాళ్ల అరెస్టు, రంగంలోకి దిగిన సీబీఐ

  • Visakha Cyber Crime : విశాఖపట్నంలో ఐదుగురు సైబర్ నేరగాళ్లను సీబీఐ అరెస్టుచేసింది. దిల్లీలో నమోదైన ఓ కేసులో భాగంగా సీబీఐ శనివారం వీరిని అరెస్టు చేసింది. విశాఖలోని ఎండాడ‌లో ఉంటున్న ఈ ఐదుగురు…ఒక కాల్ సెంట‌ర్‌లో పనిచేస్తున్నారు. వీరంతా ఆన్‌లైన్‌లో మోసాల‌కు పాల్పడుతూ ప‌లువురి నుంచి డ‌బ్బు కాజేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

29 September 2024, 9:16 IST

Andhra Pradesh News Live: Hubbali Vijayawada Express : హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ, రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దొంగతనం

  • Hubbali Vijayawada Express Chori : హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ జరిగింది. ఓ ప్రయాణికుడి నుంచి రూ.2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీ చేశారు దొంగలు. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా... మా పరిధి కాదంటూ ఇబ్బంది పెట్టారని బాధితులు వాపోతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

29 September 2024, 8:48 IST

Andhra Pradesh News Live: Apple Fined : ఐఫోన్ తో ఇయర్ పాడ్స్ ఫ్రీ ప్రకటన- యాపిల్ సంస్థకు రూ.లక్ష జరిమానా

  • Apple Fined : యాపిల్ సంస్థకు కాకినాడ వినియోగదారుల ఫోరమ్ రూ.1 లక్ష ఫైన్ విధించింది. మోసపూరిత ప్రకటనతో వినియోదారుడిని మానసిక క్షోభకు గురిచేసిందుకు అతడికి రూ.10 వేలు, కోర్టు ఖర్చులకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఐఫోన్ కొంటే ఇయర్ పాడ్స్ ఫ్రీ ఆఫర్ తో కస్టమర్ ను తప్పుదోవ పట్టించారని అభిప్రాయపడింది.
పూర్తి స్టోరీ చదవండి

29 September 2024, 5:44 IST

Andhra Pradesh News Live: AP TG Weather Updates : ఏపీ, తెలంగాణ వెదర్ అప్ డేట్- నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

  • AP TG Weather Updates : ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చాలా జిల్లాల్లో పొడి వాతావరణ ఉంటుందని పేర్కొంది. అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణ మేఘావృతమే, చిరు జల్లులు పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి