AP TG Weather Updates : ఏపీ, తెలంగాణ వెదర్ అప్ డేట్- నేడు ఈ జిల్లాల్లో వర్షాలు-ap tg weather updates hyderabad rains many districts moderate rainfall imd alert sep 29 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Weather Updates : ఏపీ, తెలంగాణ వెదర్ అప్ డేట్- నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

AP TG Weather Updates : ఏపీ, తెలంగాణ వెదర్ అప్ డేట్- నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

AP TG Weather Updates : ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చాలా జిల్లాల్లో పొడి వాతావరణ ఉంటుందని పేర్కొంది. అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణ మేఘావృతమే, చిరు జల్లులు పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది.

ఏపీ, తెలంగాణ వెదర్ అప్ డేట్స్- నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

AP TG Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి దక్షిణ కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంటుందని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలోని పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణ వెదర్ ఇలా

ఐఎండీ సూచనల మేరకు ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉత్తర తెలంగాణలో పలు చోట్ల చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉంది. ఇవాళ సాయంత్రం రాయలసీమలో చిరు జల్లులు మొదలై సోమవారం ఉదయం వరకు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో వాతావరణ మేఘావృతమే ఉంటుందని, పలు చోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

శ్రీలంకకు పశ్చిమంగా, మాల్దీవుల సమీపంలో అక్టోబర్ 1న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అంతగా ఉండకపోవచ్చని చెప్పింది. ఆదివారం ఏపీ 34 డిగ్రీల సెల్సియస్, తెలంగాలో గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొంది.