AP Rain Alert : ఏపీ ప్రజలకు అలర్ట్.. 24 జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం-ap disaster management agency has announced that 24 districts of andhra pradesh will receive rain on monday ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rain Alert : ఏపీ ప్రజలకు అలర్ట్.. 24 జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం

AP Rain Alert : ఏపీ ప్రజలకు అలర్ట్.. 24 జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం

Basani Shiva Kumar HT Telugu
Sep 29, 2024 06:19 PM IST

AP Rain Alert : తమిళనాడు నుంచి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 24 జిల్లాల్లో సోమవారం వర్షాలు కురుస్తాయని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఏపీలో వర్షాలు
ఏపీలో వర్షాలు (@APSDMA)

సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అలాగే.. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, వైయస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం నాడు.. పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి,

తమిళనాడు నుంచి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించిన కారణంగా.. తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం, సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది.

తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం రోజున ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

సోమవారం నాడు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో దక్షిణ కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి ఏర్పడింది. అది ఇప్పుడు కొమొరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు ద్వారా రాయలసీమ వరకు విస్తరించి ఉందని వాతావరణశాఖ తాజా బులెటిన్ లో వెల్లడించింది.