TTD Jobs 2024 : తిరుమలలో ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం.. ఇలా దరఖాస్తు చేసుకొండి-tirumala tirupati devasthanam jobs notification released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Jobs 2024 : తిరుమలలో ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం.. ఇలా దరఖాస్తు చేసుకొండి

TTD Jobs 2024 : తిరుమలలో ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం.. ఇలా దరఖాస్తు చేసుకొండి

Basani Shiva Kumar HT Telugu
Sep 29, 2024 09:55 PM IST

AP Jobs : టీటీడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆక్టోబర్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ పోస్టులకు సంబంధించి నెలకు రూ.2 లక్షల ఉంటుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుమలలో ఉద్యోగాలు
తిరుమలలో ఉద్యోగాలు

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తిరుపతిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మిడిల్ లెవల్ కన్సల్టెంట్స్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వారే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

రెండేళ్ల కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాలకు http://slsmpc.in/ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 7 చివరి తేదీ అని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు recruitments.slsmpc@gmail.com మెయిల్ ఐడీకీ తమ బయోడేటాను పంపాలని సూచించారు.

ఈ నోటిఫికేషన్‌లోని కీలకాంశాలు..

1.టీటీడీలో రోజువారి కార్యకలాపాలలో సాయం చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఫీల్డ్ డ్యూటీలకు పంపిస్తారు.

2.అధికారిక రిపోర్టులు, నివేదికలు ప్రిపేర్ చేయడంలో సాయం చేయాల్సి ఉంటుంది.

3.కచ్చితమైన సమాచారంతో పీపీటీలు సిద్ధం చేయాలి.

4.వివిధ గణాంకాలతో నివేదిలు సిద్ధం చేయాలి. టీటీడీ నిర్ణయాలు తీసుకోవడంలో సాయం చేయాలి.

5.బిజినెస్ ఇడ్మినిస్టేషన్‌లో మాస్టర్స్ చేసి ఉండాలి. ఎక్కువ విద్యార్హత ఉంటే మంచిది.

6.జనరల్ అడ్మినిస్ట్రేషన్‌లో 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉండాలి.

7.దరఖాస్తు చేసుకునే వారు కచ్చితంగా హిందువు అయి ఉండాలి. వేరే మతం వారికి అవకాశం లేదు.

8.నియమ నిబంధనల ప్రకారం.. నెలకు రూ.2 లక్షల జీతం ఉంటుంది.

9.అవసరం, అవకాశం మేరకు వసతి కల్పిస్తారు.

10.ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత.. ల్యాప్‌టాప్ ప్రొవైడ్ చేస్తారు.

11.ప్రస్తుతం రెండేళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొనసాగిస్తారు.

12.45 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

13.తిరుమల, తిరుపతిలో పని చేయాల్సి ఉంటుంది.