TG New Ration Cards : ప్రత్యేకంగా సమావేశాలు, అక్కడే దరఖాస్తుల స్వీకరణ...! కొత్త రేషన్ కార్డుల జారీపై తాజా అప్డేట్ ఇదే-key updates about telangana new ration card applications ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tg New Ration Cards : ప్రత్యేకంగా సమావేశాలు, అక్కడే దరఖాస్తుల స్వీకరణ...! కొత్త రేషన్ కార్డుల జారీపై తాజా అప్డేట్ ఇదే

TG New Ration Cards : ప్రత్యేకంగా సమావేశాలు, అక్కడే దరఖాస్తుల స్వీకరణ...! కొత్త రేషన్ కార్డుల జారీపై తాజా అప్డేట్ ఇదే

Sep 28, 2024, 10:03 PM IST Maheshwaram Mahendra Chary
Sep 28, 2024, 10:03 PM , IST

  • తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్ లోనే దరఖాస్తులు స్వీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఇదే విషయంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గ్రామాలు, వార్డుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తుందన్నారు.

 కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఇదే విషయంపై తెలంగాణ కేబినెట్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నెల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు.

(1 / 5)

అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇచ్చేదానిపై ఇటీవలే మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ అంశంపై త్వ‌ర‌లోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అక్టోబర్ 2 నుంచే దరఖాస్తులను స్వీకరించేందుకు సిద్ధం కావాలని కూడా సూచించారు.

(2 / 5)

కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం ప్రజలు మంత్రితో ముఖాముఖి కార్యక్రమానికి రావాల్సిన అవసరంలేదన్నారు. వాటి మంజూరుకు సంబంధించి త్వరలోనే గ్రామాలు, వార్డుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తుందని తెలిపారు.. 

(3 / 5)

గ్రామాలు, వార్డుల్లో నిర్వహించే ప్రత్యేక సమావేశాల్లోనే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

(4 / 5)

రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి.   కొత్త రేషన్‌కార్డులు, హెల్త్‌ కార్డులు విడివిడిగా అందించనున్నారు. అర్హత లేని వాళ్ల పేర్లను కూడా తొలగించే దిశగా నిర్ణయాలు తీసుకోనున్నారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు