LIVE UPDATES
TG Inter Admissions 2024 : అలర్ట్... ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే..?
Andhra Pradesh News Live September 28, 2024: TG Inter Admissions 2024 : అలర్ట్... ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే..?
28 September 2024, 21:17 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Andhra Pradesh News Live: TG Inter Admissions 2024 : అలర్ట్... ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే..?
- Telangana Intermediate Board Updates : ఇంటర్ అడ్మిషన్లపై తెలంగాణ ఇంటర్ బోర్డు మరోసారి కీలక అప్జేట్ ఇచ్చింది. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్15వ తేదీని తుది గడువుగా పేర్కొంది. ఇంకా కాలేజీల్లో చేరని విద్యార్థులు వెంటనే చేరాలని అధికారులు సూచించారు.
Andhra Pradesh News Live: Samalkot Dasara Utsavas : సామర్లకోటలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు-10 రోజుల్లో 11 అలంకరణలు
- Samalkot Dasara Utsavas : సామర్లకోట పంచారామ క్షేత్రంలో అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు బాలా త్రిపుర సుందరీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. 10 రోజులు పాటు అమ్మవారికి 11 అలంకారాలు చేయనున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Andhra Pradesh News Live: AP Govt Security Bonds : రూ.3,000 కోట్ల అప్పునకు ఏపీ సర్కార్ ఇండెంట్, అక్టోబర్ 1న బాండ్ల వేలం
- AP Govt Security Bonds : ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. మూడున్నర నెలల్లోనే ఏడుసార్లు రూ.20 వేల కోట్ల అప్పునకు ఇండెంట్ పెట్టింది. తాజాగా అక్టోబర్ 1న నిర్వహించే వేలంలో రూ.3,000 కోట్ల అప్పునకు ఏపీ ప్రభుత్వం ఆర్బీఐకు ఇండెంట్ పెట్టింది.
Andhra Pradesh News Live: Tirumala : అక్టోబర్ 1న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - 4 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
- తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబడుతుందని టీటీడీ పేర్కొంది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపింది.
Andhra Pradesh News Live: Vizag Steel Plant : ఒకేసారి 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులు తొలగింపు..!
- వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఒకేసారి 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులు తొలగించారు. 30 శాతం కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల నుంచి వెనక్కి పంపాలని నిర్ణయించారు. వారి గేట్‌పాస్‌లను వెనక్కి తీసుకోవాలని ప్లాంట్‌లోని వివిధ విభాగాల్లోని కాంట్రాక్టర్లకు, సూపర్ వైజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Andhra Pradesh News Live: YS Sharmila : వైసీపీ హయాంలో గనుల దోపిడీ, వెంకట్ రెడ్డి తీగ అయితే పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉందో? - వైఎస్ షర్మిల
- YS Sharmila : వైసీపీ ప్రభుత్వ హయాంలో గనుల దోపిడీ జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ స్కామ్ లో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు పెద్ద డొంకలు కూడా కదలాలని షర్మిల డిమాండ్ చేశారు. తెర వెనుక ఉండి, వేల కోట్లు కాజేసిన తిమింగలాన్ని పట్టుకోవాలన్నారు.
Andhra Pradesh News Live: AP LAWCET Counselling 2024 : ఏపీ లాసెట్ ప్రవేశాలు - కౌన్సెలింగ్ ఎప్పుడంటే....?
- AP LAWCET Counselling 2024: ఆంధ్రప్రదేశ్ లాసెట్ ప్రవేశాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. జూన్ లో ఎంట్రెన్స్ ఫలితాలను ప్రకటించారు. కానీ ఇంకా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కాలేదు. అక్టోబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Andhra Pradesh News Live: Target Jagan : తిరుమల చుట్టూ రాజకీయం.. జగన్ టార్గెట్‌గా టీడీపీ నేతల పంచ్‌లు!
- Target Jagan : ఇప్పుడు ఏపీ రాజకీయం అంతా తిరుమల చుట్టూ తిరుగుతోంది. ముఖ్యంగా జగన్ తిరుమల టూర్ రద్దు చేసుకోవడంతో.. టీడీపీ నేతలు ఆయన్ను టార్గెట్ చేస్తూ.. విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. హోంమంత్రి అనిత, బుద్ధా వెంకన్న జగన్‌పై ఫైర్ అయ్యారు. అటు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా జగన్‌ను టార్గెట్ చేశారు.
Andhra Pradesh News Live: Machilipatnam : మచిలీపట్నం- రేపల్లె రైల్వే లైన్‌కు ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి
- Machilipatnam : మచిలీపట్నం- రేపల్లే రైల్వే లైన్‌పై ఎంపీ బాలశౌరి దృష్టి పెట్టారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతిపత్రం ఇవ్వగా.. ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. దీంతో దివిసీమ ప్రజల కోరిక త్వరలో నెరవేరే అవకాశం ఉంది.
Andhra Pradesh News Live: Chittoor Accident : చిత్తూరు జిల్లాలో విషాదం.. మృత్యువు రూపంలో వచ్చిన రోడ్డు రోలర్.. ఇద్దరు యువకులు మృతి
- Chittoor Accident : చిత్తూరు జిల్లాలో విషాదం జరిగింది. ఇద్దరు యువకులను రోడ్డు రోలర్ బలి తీసుకుంది. రోడ్డుపై నిద్రిస్తున్న నైట్ వాచ్‌మెన్‌లపైకి దూసుకెళ్లింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh News Live: YSRCP : రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్సార్సీపీ పూజలు.. పలు చోట్ల హైటెన్షన్ వాతావరణం
- YSRCP : తిరుమల లడ్డూ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ తిరుమల పర్యటనకు వెళ్లాలనుకున్న జగన్.. రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని ఆలయాల్లో పూజలు చేయలాని నాయకులను పార్టీ ఆదేశించింది. దీంతో నేతలు పూజలకు సిద్ధం అయ్యారు. ఈ కారణంగా చాలాచోట్ల టెన్షన్ వాతావరణం నెలకొంది.
Andhra Pradesh News Live: Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మంచి రోజులు.. సెయిల్‌లో విలీనం చేసేందుకు అడుగులు!
- Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దని వందల రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయబోతున్నారని సమాచారం.
Andhra Pradesh News Live: AP Intermediate : ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు.. మంత్రి లోకేష్ కీలక నిర్ణయం!
- AP Intermediate : ఇంటర్మీడియట్ విద్యను ప్రక్షాళన చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ బుక్స్ ఉంటాయని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Andhra Pradesh News Live: Parliamentary Committee : పార్లమెంటరీ కమిటీల్లో ఏపీ, తెలంగాణ ఎంపీలకు చోటు.. ఎవరు ఏ కమిటీలో ఉన్నారు?
- Parliamentary Committee : పార్లమెంటరీ కమిటీల్లో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలకు చోటు లభించింది. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా శ్రీనివాసులు రెడ్డి (టీడీపీ), రైల్వే కమిటీ ఛైర్మన్ సీఎం రమేష్ (బీజేపీ)ని నియమించారు. ఈ మేరకు బులెటిన్ విడుదల అయ్యింది.